Medak: దారుణం.. ప్రియురాలని పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు
- మెదక్ జిల్లాలో వెలుగులోకి దారుణ ఘటన.
- ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో హత్య, ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టిన ప్రియుడు.
- మద్యం తాగుదామని చెప్పి అటవీప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసిన ప్రియుడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak: మెదక్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో ప్రియుడు ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మెదక్ పట్టణానికి చెందిన రేణుక (45) కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం నేపథ్యంలో కుమారుడు శ్రీనాథ్ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు రేణుక ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. ఇందులో ఆమెకు ఇంటి పక్కనే ఉంటున్న యేసు (40) అనే వ్యక్తితో తరచుగా మాట్లాడిన రికార్డు బయటపడింది. దాంతో పోలీసులు యేసును విచారించగా, హత్యకు సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
Read Also: Tuni Municipal Vice Chairman Election: తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నాలుగోసారి వాయిదా!
Also Read
- KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
- MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
రేణుక భర్త మరణించడంతో, ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలోని ఫతే నగర్‌లో నివసించేది. ఇంటి పక్కనే ఉంటున్న యేసుతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే, ఈ విషయం రేణుక కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమారులు మందలించడంతో రేణుక, యేసుతో సంబంధాన్ని పూర్తిగా తెంచుకుంది. అయితే ప్రియురాలు దూరమైందన్న ఆవేశంలో యేసు, ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.
Read Also: GHMC: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ.. 17 నామినేషన్లు దాఖలు
యేసు, రేణుకను మద్యం తాగుదామని చెప్పి చిన్న శంకరంపేట మండలంలోని కొండాపూర్ అటవీప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం తాగగా, మత్తులో ఉన్న రేణుకను యేసు తన వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమెను గుర్తుపట్టకుండా ఉండేందుకు శవంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. రేణుక అదృశ్యం కేసును పోలీసులు వివిధ కోణాలలో విచారించడంతో హత్యకు సంబంధించిన నిజాలు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన మరోసారి వివాహేతర సంబంధాలు ఎంతటి ఘోర పరిణామాలకు దారితీస్తాయో తెలియజేస్తోంది.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!