Medak: మెదక్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియురాలు దూరం పెట్టిందన్న కోపంతో ప్రియుడు ఆమెను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మెదక్ పట్టణానికి చెందిన రేణుక (45) కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం నేపథ్యంలో కుమారుడు శ్రీనాథ్ మెదక్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు రేణుక ఫోన్ కాల్ డేటాను…