Site icon NTV Telugu

Meerut: 16 ఏళ్ల మేనల్లుడితో ప్రేమలో పడ్డ 35 ఏళ్ల అత్త.. కట్‌చేస్తే..

Up News

Up News

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

READ MORE: Infiltration: బంగ్లాదేశ్‌ నుంచి భారీ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్ఎఫ్..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళ ఢిల్లీ నివాసి. మైనర్ బాలుడు మీరట్‌లోని దౌరాలా నివాసి. ఇద్దరూ వరసకు అత్త, అల్లుడు. ఆ మహిళ భర్త మూడేళ్ల క్రితం చనిపోయాడు. కిషోర్ పని నేర్చుకోవడానికి తన అత్త దగ్గరికి వెళ్ళాడు. ఆ బాలుడు ఢిల్లీలో ఉంటూ ఏసీ-ఫ్రీజ్ పనిని నేర్చుకుని, తరువాత మీరట్‌కు తిరిగి వచ్చి తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని కుటుంబం భావించింది.

READ MORE: BJP MP Laxman: రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని ఖర్గే కలలు కంటున్నారు..

ఢిల్లీలో కలిసి ఇద్దరూ కలిసి నివసిస్తున్నప్పుడు ఆ మహిళ మైనర్‌ను ప్రేమ ఉచ్చులో బంధించింది. చాలా కాలంగా అక్రమ సంబంధం కొనసాగించింది. ఇటీవల.. ఆ బాలుడు దౌరాలాలోని తన ఇంటికి వచ్చాడు. ఇక్కడే ఉండాలని కటుంబీకులు చెప్పారు. ఢిల్లీలో ఆ మహిళకు ఈ వార్త తెలియగానే.. ఆమెకు కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ మైనర్‌ను తనతో తీసుకెళ్తానని పట్టుబట్టింది. కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

READ MORE: Puri Sethupathi: జూన్ నుంచి షూట్.. లొకేషన్స్ రెక్కీలో పూరి బిజీ

అయితే.. ఢిల్లీ నివాసి అయిన ఆ మహిళ.. “ఈ బాలుడే నా భర్త. అతనితోనే నేను జీవిస్తాను” అని పట్టుబట్టింది. పోలీసులురెండు వర్గాలను ఒప్పించి శాంతింపజేశారు. అయితే ఈ విషయం ఇంకా పరిష్కారం కాలేదు. మీరట్ ఎస్పీ సిటీ ఆయుష్ విక్రమ్ సింగ్ ప్రకారం.. ఆ బాలుడి వయస్సు 16 సంవత్సరాలు అని కుటుంబీకులు చెబుతున్నారు. అతడి వయస్సు ధృవీకరణ పత్రం చూసిన తరువాత.. తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

Exit mobile version