సినీనటీ, ఏపీ బీజేపీ నేత మాధవిలతపై తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుకు శిరిడి సాయి భక్తుల ఐక్య వేదిక ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై రామ చందర్ రావు మాట్లాడుతూ..
శిరిడి సాయి బాబాపై అనుచిత వాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు. మనోభావాలు దెబ్బ తీయడం సరికాదు.. బాబాపై వాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదని తెలిపారు. సాయి బాబాపై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాధవీ లతకు సూచించారు. ఎవరు ఇలాంటి వాఖ్యలు చేసిన వారికి బీజేపీమద్దతు ఉండదు.. ఏకీభవించదని స్పష్టం చేశారు. ఎవరైనా సరే భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని అన్నారు.
Also Read:Trump: ఏడాదిలోపే చైనా తినేస్తోంది.. కెనడాకు ట్రంప్ వార్నింగ్
సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్న వారికి శిరిడి సాయి బాబా ఐక్య వేదిక హెచ్చరికలు జారీ చేసింది. మంచికంటి ధనుంజయ,శిరిడి సాయి భక్త ఐక్య వేదిక అధ్యక్షుడు మాట్లాడుతూ.. సాయి బాబాపై లేనిపోని మాటలు మాట్లాడితే సహించేది లేదన్నారు. సాయి బాబాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆది సరికాదు.. సాయి బాబా ఆలయంలో జరిగేవి హిందూ పూజలే.. ఇంకేదో పూజలు కాదన్నారు. హిందువులను విడదీసే కుట్రలు చేయకండి.. బాబాను, బాబా భక్తులను హేళన చేయకండి అని కోరారు. హిందూ ధర్మాన్ని కూల్చే కుట్రలు చేయడం సరికాదు.. హిందూ బంధువులను చీల్చేందుకు కొంతమందికి నిధులు ఏమైనా వస్తున్నాయా..? అని ప్రశ్నించారు.
Also Read:Tamil Nadu: ఎన్నికల వేళ కీలక ఘట్టం.. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల నియంత్రణ బిల్లుకు ఆమోదం
సాయి భక్తులు సహనంతో ఉన్నారు.. సహనం కోల్పోయేలా చేయొద్దన్నారు. మీరే హిందువులు అనే భ్రమలో ఉండకండి. కట్టర్ హిందువులు సాయి భక్తులు.. సాయి బాబాను హేళన చేసిన దాంట్లో 14 మంది మీదా కేసులు పెట్టామన్నారు. మాధవీలత, భరత్ వర్ష, లలిత్ కుమార్ లు సాయి బాబాను హేళన చేయడంలో కీలకంగా ఉన్నారని తెలిపారు. రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులను కలవడం జరిగింది చర్యలు తీసుకొమ్మని కోరామని తెలిపారు. సహనంతో ఉన్నాం, రెచ్చగొట్టకండి అని కోరారు.