Shehbaz-Rahman: యూఎన్‌లో షెహబాజ్ షరీఫ్-తారిఖ్ రెహమాన్ భేటీ.. భారత్ దృష్టి!
- బంగ్లాదేశ్‌తో పాక్ దోస్తీకి కొత్త ఊపు
- రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు
- షెహబాజ్-తారిక్ భేటీపై భారత్ ఫోకస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్-బంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భేటీ అయ్యారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో నేతలిద్దరూ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నట్లుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే మక్కా ఒప్పందంలో చేరాలని బంగ్లాదేశ్‌కు ఆహ్వానం వెళ్లింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రధానుల సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సెప్టెంబర్ 24న జరిగిన ఈ సమావేశంలో షరీఫ్-రెహమాన్ భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, విద్య, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
Also Read
- Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
- Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
- Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- Netanyahu at UN: నెతన్యాహూ చేతిలో ‘‘పేజర్’’.. ఏడు వైపుల యుద్ధం చేశామన్న ఇజ్రాయిల్..
షెహ్బాజ్ షరీఫ్, తారిక్ రెహ్మాన్ ఇరు దేశాల మధ్య సంబంధాల్లో కనిపిస్తున్న సానుకూల పరిణామాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరస్పర గౌరవం, అవగాహన, సహకారం ఆధారంగా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఐక్యరాజ్యసమితి సహా బహుపాక్షిక వేదికలపై పరస్పర సమన్వయం పెంచుకోవాల్సిన అవసరాన్ని కూడా ఇరు దేశాల ప్రధానులు ప్రస్తావించారు.
ఇక బంగ్లాదేశ్ 81వ యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినందుకు షెహ్బాజ్ అభినందనలు తెలిపారు. ఐక్యరాజ్యసమితిలో బంగ్లాదేశ్ చేపట్టే కార్యక్రమాలకు పాకిస్థాన్ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు పాకిస్థాన్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేయాలన్న తమ ప్రభుత్వ ఉద్దేశాన్ని తారిఖ్ రెహ్మాన్ వెల్లడించారు.
దోస్తీ పెంచుకుంటోంది?
బంగ్లాదేశ్‌తో సంబంధాలను మరింత విస్తరించేందుకు పాకిస్థాన్ కొంతకాలంగా ప్రయత్నిస్తోంది. వాణిజ్యం, విద్య, కనెక్టివిటీ, పెట్టుబడులు, పర్యాటకం వంటి రంగాల్లో సహకారాన్ని పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. పాకిస్థాన్‌కు బంగ్లాదేశ్‌తో సంబంధాల మెరుగుదల దక్షిణాసియాలో తన దౌత్య పరిధిని విస్తరించుకునే అవకాశంగా కనిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాలతో సంబంధాలను విస్తరించే ప్రయత్నం చేస్తోంది.
భారత్-బంగ్లా సంబంధాల మధ్యలో..
ఈ పరిణామం భారత్‌కు కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్, బంగ్లాదేశ్ మధ్య గత కొంతకాలంగా పలు అంశాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అంశం ఇరు దేశాల మధ్య సున్నితమైన సమస్యగా ఉంది. హసీనా ప్రస్తుతం భారత్‌లో ఉండగా.. ఆమెను తమకు అప్పగించాలని ఢాకా కోరుతోంది. ఈ అభ్యర్థనను భారత్ పరిశీలిస్తోంది. ఇదే సమయంలో భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను తిరిగి మెరుగుపరచుకునే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. తారిక్ రెహమాన్ భారత్ పర్యటనకు సంబంధించి నవంబర్‌లో తేదీలపై ఢిల్లీ, ఢాకా మధ్య చర్చలు జరుగుతున్నట్లు జాతీయ మీడియా నివేదించింది.
తాజావార్తలు
-
Pakistan: ‘‘హఫీజ్ సయీద్‌ను ఎప్పుడు విచారిస్తారు?’’.. పాకిస్తాన్ ప్రధాని మౌనం..
-
Viveka Murder Case: వివేకా కేసులో సునీల్ యాదవ్ సంచలన వాంగ్మూలం..!
-
Govt Job Got: పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం.. 59 ఏళ్ల వయస్సులో ప్రభుత్వ ఉద్యోగం..
-
Pakistan-Afghanistan War: పాక్-ఆఫ్ఘాన్ల మధ్య ఉద్రిక్తత.. పారిపోతున్న పాక్ సైనికులు.!
-
Kohli-Rohit-Gill: విరాట్ కోహ్లీ 91, రోహిత్ శర్మ 64.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఫ్లాప్!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!