Netanyahu: మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా? మమ్దానీపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం
- న్యూయార్క్ మేయర్ మమ్దానీపై నెతన్యాహు ఫైర్
- మా దేశంపై దాడి చేస్తే నీ భార్య సమర్థించలేదా?
- సిగ్గుగా ఉండాలంటూ తీవ్ర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐక్యరాజ్యసమితి వేదికగా న్యూయార్క్ మేయర్ మమ్దానీపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రసంగం మొదలు పెట్టిన 30 నిమిషాల తర్వాత మమ్దానీ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ‘‘ఇజ్రాయెల్ దేశంపై హమాస్ దాడి చేసినప్పుడు నీ భార్య రమా దువాజీ సమర్థించలేదా?’’ అంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియా క్లిప్‌లను ఎత్తిచూపించారు. ‘‘బాధితుడిని.. దురాక్రమణదారుడిని తారుమారు చేసినందుకు మీకు సిగ్గుగా ఉండాలి.’’ అని మండిపడ్డారు.
‘‘మీరు ఇజ్రాయెల్‌పై జాతి హత్య ఆరోపణలు పదే పదే చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఎప్పుడూ జాతి హత్యకు పాల్పడలేదు. జాతి హత్యను నివారించింది. ఒకవేళ మేము ఆపకపోయింటే మమ్దానీ మిత్రులైన హమాస్ అదే చేసి ఉండేవారు.’’ అని వ్యాఖ్యానించారు.
Also Read
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
- Israel: ఇజ్రాయిల్ వెళ్లే విమానాల్లో పాక్ పైలట్లు, సిబ్బందిపై నిషేధం..!
- Crude Oil Prices Rise: చమురు ధరలకు మళ్లీ రెక్కలు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా..?
- Saudi Arabia: మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు.. హిందూ వ్యక్తికి మరణశిక్ష నుంచి ఊరట..
గత నెల రోజులుగా మమ్దానీ సోషల్ మీడియాలో నెతన్యాహుపై విమర్శలు చేస్తున్నారు. మంగళవారం కూడా ‘భయంకరమైన జాతి నిర్మూలనకు సూత్రధారి’’ అని అభివర్ణించారు. నెతన్యాహు వస్తే అరెస్ట్ చేస్తామంటూ కూడా బెదిరించారు. దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ నెతన్యాహు కూడా ప్రతి సవాల్ విసిరారు.
ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వంతు రాగానే సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. నెతన్యాహు ప్రసంగం ప్రారంభించగానే డజన్ల కొద్దీ ప్రతినిధులంతా జనరల్ అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇక ఇరాన్ వాకౌట్ చేస్తూ ఖాళీ బల్లపై సులేమానీ చిత్రపటాన్ని ఉంచేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా సభ నుంచి వెళ్లిపోయిన వారిని ఉద్దేశించి ‘నైతిక పిరికివాళ్లు’ అంటూ నెతన్యాహు సంబోధించారు.
అయితే నెతన్యాహు మద్దతుదారులు మాత్రం సభలో నిలబడి చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచారు. దీంతో మిగిలిన నిరసనకారులంతా వెళ్లిపోవాలని నెతన్యాహు సూచించారు. ఈ సభలో విడిచి వెళ్లని నైతిక పిరికివాళ్లు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే వెళ్లిపోవాలని తెలిపారు. ఇక నెతన్యాహు పనిలో పనిగా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పలువురు అంతర్జాతీయ విమర్శకులపై కూడా మండిపడ్డారు. ఇక అక్టోబర్ 27న ఇజ్రాయెల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూఎన్‌లో నెతన్యాహు చేసిన ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..