French Open 2025: లేడీ నాదల్ ఔట్.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా!
- ఇగా స్వైటెక్ విజయ పరంపరకు తెర
- స్వైటెక్‌కు అరీనా సబలెంకా షాక్
- యానెక్ సినర్‌తో తలపడనున్న నొవాక్ జకోవిచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎర్రమట్టి కోర్టు కింగ్, లేడీ నాదల్ ఇగా స్వైటెక్ విజయ పరంపరకు తెర పడింది. ఫ్రెంచ్ ఓపెన్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన స్వైటెక్‌కు అరీనా సబలెంకా షాక్ ఇచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7-6 (7-1), 4-6, 6-0తో స్వైటెక్‌ను ఓడించింది. హ్యాట్రిక్ టైటిళ్లు గెలిచిన స్వైటెక్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసిన సబలెంకా.. రొలాండ్ గారోస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం కొకో గాఫ్‌తో సబలెంకా తలపడనుంది. రొలాండ్ గారోస్‌లో మూడేళ్ల తర్వాత కొత్త ఛాంపియన్ రాబోతోంది.
క్వార్టర్స్‌లో ఆరోసీడ్ నొవాక్ జకోవిచ్ 4-6, 6-3, 6-2, 6-4తో అలెగ్జాండర్ జ్వెరెవ్‌ని ఓడించాడు. నొవాక్ తొలి సెట్ ఓడినా.. తర్వాతి మూడు సెట్లు సొంతం చేసుకుని మ్యాచ్ గెలిచాడు. మూడు గంటలకు పైగా సాగిన పోరులో జకోవిచ్ 6 ఏస్‌లు, 42 విన్నర్లు కొట్టాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలో జకోవిచ్ సెమీఫైనల్ చేరడం ఇది 52వ సారి. నేడు జరిగే పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్‌సీడ్ యానెక్ సినర్‌తో జకో తలపడనున్నాడు. సినర్‌తో గత అయిదు మ్యాచ్‌ల్లో నాలుగింట్లో జకోవిచ్ ఓడిపోవడం విశేషం. మరో సెమీస్‌లో అల్కరాస్, ముసెట్టి తలపడనున్నారు.
Also Read
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
- Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
తాజావార్తలు
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్‌లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్‌పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!