Actress Bhoomi Shetty Said Netizens Trolls on My Skin Color: సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన కన్నడ భామ భూమి శెట్టి.. అనతికాలంలోనే హీరోయిన్‌గా మారారు. కన్నడ చిత్రం ‘ఇక్కత్’తో సినీ రంగ ప్రవేశం చేసి.. ‘షరతులు వర్తిస్తాయి’ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. శుక్రవారం రిలీజ్ అయిన షరతులు వర్తిస్తాయి చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భూమి శెట్టి పలు విషయాలు పంచుకున్నారు.
తన రంగు విషయంలో చిన్నతనం నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని భూమి శెట్టి తెలిపారు. ‘నా శరీర రంగు విషయంలో చిన్నతనం నుంచి అవమానాలు ఎదుర్కొన్నా. ఇతరుల మాటలతో ఎన్నోసార్లు బాధపడ్డా. ఫంక్షన్స్‌కూ ఎక్కువగా వెళ్లేదాన్ని కాదు. ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు?, తెల్లగా మారడానికి ఏదైనా క్రీమ్స్ వాడు కదా అని చాలా మంది చెప్పేవారు. ఇప్పటికీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేస్తే నల్లగా ఉన్నానని కామెంట్స్ చేస్తుంటారు. అయితే వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా అందం గురించి నాకు తెలుసు’ అని భూమి శెట్టి చెప్పారు.
Also Read: Travis Head-IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో చేరిన ప్రపంచకప్ హీరో.. ఇక పరుగుల వరదే!
భూమి శెట్టి కర్నాటకలోని కరావలి ప్రాంతంలో ఉన్న కుందాపురలో 1998లో జన్మించారు. భాస్కర్, బేబీ శెట్టి దంపతుల కుమార్తె భూమి. రాజకీయ నేపథ్య కుటుంబం నుంచి వచ్చిన భూమి.. చదువుతున్న రోజుల్లోనే ఓ మ్యాగజైన్ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఎన్నో ఆడిషన్స్ తర్వాత కన్నడ సీరియల్ కిన్నరిలో నటించే అవకాశం వచ్చింది. నిన్నే పెళ్లాడతా అనే తెలుగు సీరియల్‌లో నటించారు. 2019లో బిగ్ బాస్ కన్నడలో కూడా పాల్గొన్నారు. ఇక 2021లో కన్నడ చిత్రం ఇక్కత్‌తో సినీ రంగ ప్రవేశం చేశారు. తాజాగా షరతులు వర్తిస్తాయిలో నటించారు.