Shankar : కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారీ బడ్జెట్ ఉంటేనే సినిమాలు తీసే శంకర్ కి ఇప్పుడు హిట్ అవసరం. అది ‘గేమ్ ఛేంజర్’ రూపంలో బ్లాక్ బస్టర్ కావాలి. అది ఎలా ఉండాలి అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇమేజ్ ని సైతం రెట్టింపు చేసేలా ఉండాలి. శంకర్ పై ఎంతో నమ్మకం పెట్టుకుని రామ్ చరణ్ సినిమాలో నటించాడు. ఆర్ ఆర్ ఆర్ సెట్స్ లో ఉండగానే శంకర్ ని ఎంచుకుని వావ్ అనిపించాడు. కానీ శంకర్ ఇటీవల తెరకెక్కించిన ఇండియన్ -2 ఫెయిల్యూర్ చూసిన తర్వాత చరణ్ రైట్ వేలో వెళ్తున్నాడా? రాంగ్ వేలో వెళ్తున్నాడా? అన్న సందేహాలు సైతం తెరపైకి వచ్చారు.
Read Also:Delhi: అమిత్ షాను కలిసిన కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు
వాటన్నింటికి జనవరి 10న పుల్ స్టాప్ పడనుంది. ఆ సంగతి పక్కన బెడితే గేమ్ ఛేంజర్ తర్వాత శంకర్ చేయబోయే సినిమా ఏంటి? ఇండియన్ -3 సంగతి పక్కనబెడితే? ఇదిప్పుడు మిస్టరీగా మారింది. అతడు స్టార్ హీరోలతో ముందుకెళ్లాలంటే గేమ్ ఛేంజర్ తప్పనిసరిగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. లేదంటే? స్టార్ హీరోలు ముందుకొచ్చి ఆయనకు డేట్స్ ఇచ్చే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. దీంతో శంకర్ ప్లాన్ బీని కూడా రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. కాబట్టి తెలుగులోనే ఓ సింపుల్ లవ్ స్టోరీ తీసే ఆలోచన చేస్తున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
Read Also:Bengaluru: రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. బస్‌ను నియంత్రించిన కండక్టర్
తక్కువ బడ్జెట్లో ఓ యూత్ పుల్ లవ్ స్టోరీ చేసే ఆలోచన ఉన్నట్లు కనిపిస్తుంది. గతంలో శంకర్ బాయ్స్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. అందులో అంతా కొత్తవారినే పెట్టుకుని మంచి హిట్ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ శంకర్ ఆ తరహా ప్రయత్నం చేయలేదు. అన్ని భారీ బడ్జెట్ చిత్రాలు.. అగ్ర హీరోలతోనే సినిమాలు చేసారు. టెక్నికల్ సినిమాలు… హీరో ఇమేజ్ ఆధారంగానే పనిచేశారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆ తరహా కంటెంట్ ని పక్కనబెట్టి రిలాక్స్ గా ఓ లవ్ స్టోరీ చేసే ఆలోచన ఓ ఆప్షన్ గా పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. బాయ్స్ లాంటి లవ్ స్టోరీ అంటే తిరుగుండదు. బాయ్స్ -2 టైటిల్ తో సినిమా చేస్తే ఇప్పటి జనరేషన్ కి పాదరసంలా ఎక్కేస్తుంది. ఆ రకంగా నేటి జనరేషన్ యువతకి శంకర్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాంటి కథ రెడీగా ఉంటే? దిల్ రాజే గేట్ శంకర్ ని గేట్ దాటనివ్వరు.