Hyderabad: ఏరోసిటీగా శంషాబాద్ అభివృద్ధి.. జంట నగరాలకు తోడుగా మరో నగరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ అభివృద్ధిలో శంషాబాద్ ఇప్పుడు హాట్ ఫేవరేట్‌గా నిలిచింది. కార్పొరేట్ల చూపు ఇక్కడ పడుతుండటంతో కీలక రంగాల విస్తరణ జోరుగా సాగుతుంది. ఇప్పటికే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయంగానూ ఎన్నో ప్రశంసలు పొందుతుంది. ప్రయాణికుల రవాణాలోనేగాక సరుకు రవాణాలో సౌత్ ఇండియాలోనే కీలకమైన ఎయిర్ పోర్ట్ గా పేరుగాంచింది.
Also Read : Heavy Traffic in Panjagutta: పంజాగుట్టలో భారీగా ట్రాఫిక్ జామ్.. సీఎం రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
Also Read
దీనికితోడు సుమారు 5వేల ఎకరాలకుపైగా విస్తరించి ఉన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సరికొత్తగా ఏరోసిటీ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు సరుకు రవాణాపరంగా భారీ కేంద్రాలను ఏరోసిటీలో ఏర్పాటు చేస్తుండటంతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. విద్య, వైద్య, ఆతిథ్య, క్రీడలు, వినోదం వంటి రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు ఏరోసిటీలోకి రానున్నాయి.
Also Read : Japan: ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
అయితే.. మాదాపూర్ నుంచి కోకాపేట, తెల్లాపూర్, కొల్లూరు వరకు సుమారు 21 కిలో మీటర్ల మేర విస్తరించింది. మొత్తంగా ఐటీ కారిడార్‌లో వేల సంఖ్యలో ఐటీ కంపెనీలు, అదే స్థాయిలో ఐటీ ఉద్యోగుల నివాసాల కోసం గేటెడ్ కమ్యూనిటీ హైరైజ్ అపార్టుమెంట్లు, విల్లా ప్రాజెక్టులతో ఈ ప్రాంతం మరో కొత్త నగరంగా మారింది. అలాంటి నాలుగో నగరంగా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌కు ఔటర్ రింగు రోడ్డు అధునాతన వారధిగా నిలుస్తుంది.
Also Read : Minister KTR: నేడు సిరిసిల్ల, రేపు సిద్దిపేట.. మంత్రి కేటీఆర్ పర్యటన వివరాలు
రోడ్డు, రైలు, మెట్రో రైలుతో పాటు ఎయిర్‌వేస్‌లు శంషాబాద్ కేంద్రంగా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి ఒకటైతే, అక్కడి నుంచే మొదలయ్యే గ్రేటర్ చుట్టూ ఔటర్ రింగు రోడ్డు.. ఇక దక్షిణాది రాష్ర్టాలను కలిపే ప్రధాన రైలు మార్గాల్లో ఒకటిగా సికింద్రాబాద్, కాచిగూడల నుంచి బెంగళూ రువైపున్న రైలు మార్గం శంషాబాద్ మీదుగానే వెళ్తుంది. తాజాగా ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని దాదాపు 31 కిలో మీటర్ల పొడవుతో ఔటర్ రింగు రోడ్డు వెంబడి ఆకాశ మార్గంలో నిర్మిస్తున్నారు.
Also Read : Viral: మండే ఎండలో ఒంటే దాహం తీర్చిన లారీ డ్రైవర్..
ఉద్యోగులు ఒకచోట నుంచి మరోచోటుకు వెళ్లాలంటే సమయం వృథా అవుతున్నది.. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ తెలంగాణ సర్కార్ వాక్ టు వర్క్ కాన్సెప్ట్‌తో పరిశ్రమల ఏర్పాటుతో పాటు అక్కడే నివాసం ఉండేందుకు టౌన్‌షిప్‌ల నిర్మాణాన్ని ఎంకరేజ్మెంట్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ నిర్మించిన ఓఆర్‌ఆర్‌పై ఉన్న 19 ఇంటర్‌చేంజ్‌ల వద్ద టౌన్‌షిప్‌లను నిర్మించడంతో పాటు దానికి సమీపంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!