శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే సరికొత్తగా ఏరోసిటీ నిర్మాణం స్టార్ట్ అవుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థలు సరుకు రవాణాపరంగా భారీ కేంద్రాలను ఏరోసిటీలో ఏర్పాటు చేస్తుండటంతో వేలాది మందికి ఉద్యోగావకాశాలు దక్కాయి. విద్య, వైద్య, ఆతిథ్య, క్రీడలు, వినోదం వంటి రంగాలకు సంబంధించిన కార్యకలాపాలు ఏరోసిటీలోకి రానున్నాయి.