Heavy Traffic in Panjagutta: తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ పంజాగుట్టలోని నిమ్స్ లో ట్విన్ టవర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు తెలిపారు. దీంతో స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లే రోగులు, వారి బంధువులపై పోలీసులు ఆంక్షలు విధించడంతో రోగులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. చికిత్స కోసం వచ్చిన ఇప్పటి వరకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. ఇక ప్రయాణికులు లబోదిబో మంటున్నారు. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వరకు భారీగా ట్రాఫిక్ అయ్యిందని మండిపడుతున్నారు. మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యాన్మాయ మార్గాలు పోలీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read also: Japan: ఆర్మీ ట్రైనింగ్ రేంజ్‌లో కాల్పులు.. ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ‘తెలంగాణ మెడికల్ డే’ నిర్వహించనున్నారు. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ లో అత్యాధునిక 2000 పడకల సూపర్ స్పెషాలిటీ కొత్త బ్లాక్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు 24 జిల్లాల్లోని గర్భిణులకు కేసీఆర్ పౌష్టికాహార కిట్‌ల పంపిణీ తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ప్రధాన కార్యక్రమాలు జరిగాయి. తృతీయ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సబ్ సెంటర్లు, పీహెచ్‌సీలు, బస్తీ, గ్రామీణ డిస్పెన్సరీలతో సహా అన్ని ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు తెలంగాణ వైద్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రజారోగ్య సంరక్షణ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు.