Hyderabad Road Accident: బైక్ ఢీ కొనడంతో పూర్తిగా దగ్ధమైన బస్సు.. ఓ వ్యక్తి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
One Person Died after Bike Hits Bus in Shamirpet: శామీర్‌పేటలోని జీనోమ్ వ్యాలీ ఠాణా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఢీ కొట్టడంతో ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగి బస్సుకు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…
సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని వరదరాజపురానికి చెందిన సంపత్ కుమార్ (26) యూజే ఫార్ములా కంపెనీలో పని చేస్తున్నాడు. విధుల నిమిత్తం మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో తన బైక్‌పై బయలుదేరాడు. కొల్తూరు వద్ద ప్రధాన రహదారిపై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును అతడు ఢీ కొట్టాడు. ఈ ఘటనలో సంపత్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Also Read: Yuzvendra Chahal: ఆ కారణంతోనే యుజువేంద్ర చహల్‌కు జట్టులో చోటు దక్కలేదు!
బైక్ పెట్రోల్ ట్యాంక్ లీకై మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ఆ మంటలు బస్సుకు అంటుకున్నాయి. దీంతో బైక్‌తో పాటు బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సుకు మంటలు అంటుకోగానే.. అందులోని ప్రయాణికులు వెంటనే కిందకు దిగిపోయారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?