IND vs BAN: టీమిండియాపై అద్భుత రికార్డులు.. భారత్‌ను బయపెడుతున్న ముగ్గురు బంగ్లాదేశ్ ప్లేయర్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shakib Al Hasan, Liton Das and Mehidy Hasan Have A Good Record against India: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ కొడుతోంది. పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్ ఆరంభం కానుంది. ఆసీస్, అఫ్గన్, పాక్‌లను అలవోకగా ఓడించిన భారత్.. బంగ్లాపై కూడా విజయం సాధించాలని చూస్తోంది. భారత్ జోరు చూస్తుంటే విజయం ఖాయమే అనిపిస్తోంది. అయితే భారత జట్టును ముగ్గురు బంగ్లాదేశ్ ప్లేయర్స్ భయపెడుతున్నారు. ఆ ముగ్గురికి టీమిండియాపై అద్భుత రికార్డులు ఉన్నాయి. ఆ ప్లేయర్స్ ఎవరో ఓసారి చూద్దాం.
షకిబుల్ హాసన్, మెహిదీ హాసన్ మిరాజ్, లిటన్ దాస్‌లకు టీమిండియాపై అద్భుత రికార్డులు ఉన్నాయి. ఈ ముగ్గురు మ్యాచ్‌ను ఈజీగా మలుపు తిప్పేయగలరు. బంగ్లాదేశ్‌కు కెప్టెన్ షకిబుల్ టీమిండియా మ్యాచ్ అంటే రెచ్చిపోతాడు. గతంలో భారత్‌పై మంచి ఇన్నింగ్స్‌లు, వికెట్లు తీశాడు. భారత్‌తో జరిగిన 22 వన్డేల్లో 9 హాఫ్ సెంచరీలు చేశాడు. 4.88 ఎకానమీతో 29 వికెట్లు తీశాడు. అయితే గాయం కారణంగా నేటి మ్యాచ్ షకిబుల్ ఆడడం అనుమానమే.
Also Read
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
- Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
- IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
- IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
Also Read: IND vs BAN: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. రోహిత్ శర్మ నాలుగో సెంచరీ చేసేనా?
సీనియర్ ప్లేయర్ లిటన్ దాస్ దూకుడైన ఆటతీరుతో టీమిండియాను బెంబేలెత్తిస్తున్నాడు. పవర్‌ప్లేలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం దాస్‌కు అలవాటు. అందుకే అతడిని ఎంత త్వరగా ఔట్ చేస్తే.. టీమిండియాకు అంత మంచిది. దాస్ 10 వన్డే మ్యాచ్‌లలో 305 పరుగులు చేశాడు. ఆది అత్యధిక స్కోరు 121. ఇక మెహిదీ హాసన్ మిరాజ్ ప్రతీసారి భారత్‌పై అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గతేడాది జరిగిన ఓ మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. అందులో భారత్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!