షాహిద్ అఫ్రిదీ.. ప్రపంచ క్రికెట్‌లో విధ్వంసకర బ్యాటర్లలో ముందుంటాడు. కొంతకాలం క్రితమే ఇతడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. అయితే ప్రస్తుతం పాక్ జట్టులో కీలక పేసర్‌గా ఎదిగిన షహీన్ అఫ్రిదీ.. షాహిద్ అఫ్రిదీ అల్లుడు అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మామా అల్లుళ్ల మధ్య క్రికెట్ పిచ్‌పై పోటీ గట్టిగానే సాగింది. ఓ ప్రాక్టీస్ మ్యాచ్‌లో మామ షాహిద్‌కు బౌలింగ్ చేశాడు అల్లుడు షహీన్. ప్రపంచంలోని మేటి బౌలర్లలో ఒకడిగా పేరుగాంచిన తన అల్లుడు షహీన్ అఫ్రిదీకి తన బ్యాటింగ్ రుచి చూపించాడు మామ షాహిద్.. త్వరలో తన కూతురును పెళ్లి చేసుకోబోతున్న షహీన్‌కు సిక్స్ రూపంలో ఓ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. మోకాలి గాయం నుంచి కోలుకుంటున్న షహీన్.. తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అంతకుముందు పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. తన రిహబిలేషన్‌లో భాగంగా పాక్ సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి షహీన్ ఈ మ్యాచ్ ఆడాడు.
Also Read: Hanuma Vihari: ఇది రివర్స్ స్వీప్ కాదు, రివర్స్ స్లాప్..విహారి సింగిల్ హ్యాండ్ షాట్
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో షహీన్ వేసిన ఓవర్ పిచ్ బాల్‌ను అఫ్రిదీ సిక్స్‌గా మలచడం చూడొచ్చు. ఆ బంతిని నేరుగా షహీన్ తలమీదుగానే అఫ్రిదీ బౌండరీ అవతలికి పంపించాడు. ఆ తర్వాత మరో వీడియోలో షాహిద్ కూడా పిచ్‌పై నిల్చొని బాల్ వేయగా.. షహీన్ దానిని సిక్స్ కొట్టాడు. ఈ సందర్భంగా అల్లుడికి సిక్స్ ఎలా కొట్టాలో కూడా అఫ్రిది చూపించడం ఈ వీడియోలో కనిపిస్తుంది.
𝐀𝐠𝐞 𝐢𝐬 𝐣𝐮𝐬𝐭 𝐚 𝐧𝐮𝐦𝐛𝐞𝐫🔥#PakistanCricket #ShahidAfridipic.twitter.com/THeMzEO1Ib
— Cricket Pakistan (@cricketpakcompk) February 2, 2023
ప్రస్తుతం షాహిద్ అఫ్రిదీ పాకిస్తాన్ టీమ్ సెలెక్షన్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా ఉన్నాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా షహీన్ మోకాలికి గాయమైంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్లో ఓ క్యాచ్ అందుకోబోయి అతను గాయపడ్డాడు. దీంతో ఫైనల్లో కీలకమైన సమయంలో అతడు మళ్లీ బౌలింగ్ చేయలేకపోయాడు. అంతకుముందు తగిలిన గాయం దీని కారణంగా మరింత తీవ్రమైనట్లు తర్వాత తేలింది. ఇక షహీన్ పెళ్లి విషయానికి వస్తే అతడు శుక్రవారమే (ఫిబ్రవరి 3) షాహిద్ అఫ్రిదీ కూతురు అన్షాను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాది జనవరిలో ఇద్దరు పాకిస్తాన్ క్రికెటర్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హరీస్ రవూఫ్, షాదాబ్ ఖాన్‌లు గత జనవరిలో పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు షహీన్ కూడా ఆ లిస్ట్‌లో చేరనున్నాడు.