Shahid Afridi: “భారత్ దెబ్బకు వణికిపోయాం”.. పాత గాయాన్ని గుర్తు చేసుకున్న పాక్ దిగ్గజం అఫ్రిది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: టీమిండియా క్రికెట్లో హిస్టరీలు క్రియేట్ చేస్తోంది. తన రికార్డులు తానే బద్దలుగొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. ఏకంగా మూడు టీ20 వరల్డ్ కప్పులను తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు కడుపు మంట ఎక్కువైంది. అయితే.. తాజాగా పాకిస్థాన్ మాజీ దిగ్గజం షాహిద్ అఫ్రిది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అంశంపై ఓ మీడియాలో మాట్లాడాడు. టీమిండియా గ్రాండ్ విక్టరీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాత జ్ఞాపకాలు సైతం గుర్తు చేసుకున్నాడు. గతంలో పంజాబ్ రాష్ట్రం మొహాలీలో భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టీమ్ వణికిపోయిందని తన అనుభవాలను వివరించాడు. “2011 సెమీఫైనల్ మొహాలీ స్టేడియంలో జరిగింది. మేము ఛేజింగ్‌ను చాలా బాగా మొదలుపెట్టాం. మహమ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్ వికెట్ పడకుండా 90 పరుగులు చేశారు. కెప్టెన్‌గా నేను చాలా రిలాక్స్‌గా కూర్చు్న్నా. ఈసారి కచ్చితంగా గెలుస్తామనుకున్నా. కానీ, మొదటి వికెట్ పడగానే పరిస్థితి తలకిందులైంది. అక్కడ ఉన్న భారతీయ ప్రేక్షకుల కేకలు, ఆ ఉత్సాహం టీమ్ ఇండియాలో కొత్త ఊపిరి పోశాయి. దీంతో మా టీమ్ బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. స్టేడియంలో ఆ శబ్దానికి, భారత జట్టు పోరాట పటిమకు నా జట్టులోని కొందరు బ్యాటర్లు క్రీజులో వణికిపోయారు. ప్రతి బంతికి వారు ఇబ్బంది పడ్డారు. ఆ హోరులో మా జట్టు పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయింది.” అని నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు.
READ MORE: Iran: యుద్ధం ముగింపునకు ఇరాన్ 3 షరతులు.. రెస్పాన్స్ ఎలా ఉంటుందో..!?
Also Read
- Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
- Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
- 10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
- AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలపై అలర్ట్.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
ఇక 2011 ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌లో భాగంగా మొహాలీలో జరిగిన భారత్-పాకిస్థాన్ సెమీఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పాకిస్థాన్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ 85 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో సచిన్‌కు నాలుగు సార్లు లైఫ్ వచ్చింది. పాక్ ఫీల్డర్లు ఎంత ఒత్తిడిలో ఉన్నారో ఈ ఫీల్డింగ్ చూస్తే అర్థమవుతోంది. ఇక వీరేంద్ర సెహ్వాగ్ కేవలం 25 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు.. 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 231 పరుగులకే ఆలౌట్ అయింది.
READ MORE: Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. వారికి ఊహించని విజయాలు!
తాజావార్తలు
-
Telangana Congress New In-Charge: తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త ఇంచార్జ్.?
-
iOS 27 Update: iOS 27 అప్డేట్ విడుదల.. ఏ iPhone మోడళ్లకు లభిస్తుంది? డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
-
RamBola Title War: ఒకే టైటిల్‌తో రెండు సినిమాలు..‘రామ్ బోలా’ వివాదంలో హనుమాన్ అంశ్ దర్శకుడు
-
Chandrababu Tirumala Visit: తిరుమలకు సీఎం చంద్రబాబు.. శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలో రికార్డు
-
Ranabaali Postpone : విజయ్ దేవరకొండ ‘రణబాలి’ పోస్ట్‌పోన్ అవుతుందా?
ట్రెండింగ్
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!