Shahid Afridi on RO-KO: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది మరోసారి భారత క్రికెట్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ప్రశంసిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా వన్డే జట్టులో ఈ ఇద్దరిని పక్కన పెట్టాలన్న ప్రయత్నాలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తునాన్ని అన్నారు. వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు గుండె, వెన్నెముకలాంటి వారని.. 2027 వరల్డ్ కప్ వరకు సులభంగా ఆడగలరని పేర్కొన్నారు. ఆఫ్రిది తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో వీరిద్దరూ చూపిన ప్రదర్శనను చూస్తే మరికొన్ని సంవత్సరాలు ఎటువంటి డోకా లేకుండా ఆడగలరని ఆన్నారు. ముఖ్యమైన సిరీస్‌ల్లో రోహిత్, విరాట్‌లను తప్పకుండా ఆడించాలని.., బలహీన జట్లతో ఆడేటప్పుడు కొత్త ప్లేయర్లను పరీక్షించవచ్చని ఆఫ్రిది సూచించారు.
CMRF Record : సీఎం సహాయ నిధి పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రికార్డు
ఇక టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై కూడా ఆఫ్రిది స్పందించారు. గతంలో ఇద్దరి మధ్య జరిగిన ఆన్-ఫీల్డ్ ఘర్షణలను గుర్తుచేస్తూ.. గంభీర్ మొదట కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పుడు తన ఆలోచనే సరైందని భావించినట్టు అనిపించిందని.. కానీ, ఆ తరువాత అది అలా కాదని తెలుస్తుందన్నారు. ప్రతి సందర్భంలోనూ మన అభిప్రాయం సరైనదే అని అనుకోవడం తప్పని తెలిపారు.
BIS సర్టిఫికేషన్‌తో భారత్‌లో లాంచ్ కావడానికి సిద్ధమైన Vivo V70, Vivo T5x స్మార్ట్ ఫోన్స్..!
రోహిత్ శర్మ తన వన్డే సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టడం పట్ల ఆఫ్రిది ఆనందం వ్యక్తం చేశారు. రికార్డులు బద్దలవ్వడానికి మాత్రమే ఉంటాయని, తాను ఇష్టపడే ఆటగాడు ఈ రికార్డును అధిగమించాడన్నది తనకు సంతోషంగా ఉందన్నారు. తన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ 18 సంవత్సరాలు నిలిచిందని, తర్వాత అది బద్దలైందని.. ఇదే ఆట సహజ స్వభావమని తెలిపారు. రాయ్‌పూర్‌లో జరిగిన రెండో ODIలో రోహిత్ 351 సిక్సులను అధిగమించి ఇప్పుడు 355 సిక్సులతో ముందంజలో ఉన్నాడు. IPLలో 2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడినప్పుడే రోహిత్ శర్మలో ఉన్న క్లాస్‌ను చూశానని, అప్పుడే భారత జట్టులో పెద్ద స్థాయిలో ఆడతాడని నమ్మకం కలిగిందన్నారు. రోహిత్ ఈరోజు ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌గా ఎదిగిన తీరు తనను ఆకట్టుకుందని అన్నారు.