2025లో బాలీవుడ్ స్టార్ హీరోలంతా ఒక్క సినిమాతోనైనా హాయ్ చెప్పారు. త్రీ ఖాన్స్‌లో సల్మాన్, అమీర్ ఖాన్ చెరో మూవీతో సరిపెట్టేస్తే అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ ఎవ్రీ ఇయర్‌లానే త్రీ, ఫోర్ ఫిల్మ్స్‌తో పలకరించేశారు. విక్కీ కౌశల్ ఛావాతో తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రాన్ని చూడగా.. షాహీద్ కపూర్, రాజ్ కుమార్ రావ్, వరుణ్ ధావన్ కూడా అరకొర చిత్రాలతో హాయ్ చెప్పేశారు. ఇక కార్తీక్ ఆర్యన్, రణవీర్ సింగ్ డిసెంబర్ నెలలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక ఈ ఏడాది రానిదల్లా షారూఖ్ ఖాన్ అండ్ రణబీర్ కపూరే.
Also Read : Suriya : వరుస ప్లాపులు.. ప్రయోగాలకు దూరంగా సూర్య.. టాలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్
ఈ ఏడాదే కాదు.. దాదాపు టూ ఇయర్స్ బాలీవుడ్ ప్రేక్షకులతో టచ్ కోల్పోయారు రణబీర్ అండ్ కింగ్ ఖాన్. 2023లో డంకీతో హ్యాట్రిక్ థౌజండ్ క్రోర్ కొల్లగొట్టి రికార్డ్స్ క్రియేట్ చేద్దామని ప్లాన్ వేసుకున్న షారూఖ్ ఆశని నిరాశ అయ్యేలా చేసాడు ప్రభాస్ . ఈ షాట్‌కు టూ ఇయర్స్ గ్యాప్ ఇచ్చేశాడు కింగ్ ఖాన్. ఈ సారి భారీ స్కెచ్ వేసుకుని వస్తున్నాడు కింగ్ ఖాన్. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వస్తున్న కింగ్ మూవీతో 2026ని టార్గెట్ చేయడమే కాదు ప్రభాస్‌పై ఎస్‌ఆర్కే రివేంజ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. ఫౌజీ రిలీజయ్యే టైంలోనే తన కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీని షారూఖ్ తీసుకురాబోతున్నాడని బీటౌన్ బజ్. యానిమల్‌తో తాను ఊహించనంత స్టార్ డమ్ వచ్చి పడటంతో రణబీర్ కపూర్ ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. నెక్ట్స్ ఈ ఇమేజ్ ఏ మాత్రం తగ్గకుండా సినిమాలను సెట్ చేశాడు. గ్యాప్ వచ్చినా పర్లేదు.. కొడితే కుంభస్థలం కొట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో నెక్ట్స్ ఇయర్ భారీ ప్రాజెక్టులతో వస్తున్నాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లవ్ అండ్ వార్‌తో పాటు ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ పార్ట్ వన్‌తో 2026 దీపావళికి రాబోతున్నాడు. ఇలా టూఇయర్స్ గ్యాప్ ఇచ్చిన షారూఖ్ అండ్ రణబీర్.. నెక్ట్స్ ఇయర్ బాక్సాఫీస్ బెండ్ తీసేందుకు గట్టిగానే ప్లాన్ చేసుకుంటున్నారన్న మాట.
