Pallavi Prashanth Drivers arrested in Bigg Boss 7 Issue: బిగ్ బాస్ షో అనంతరం జరిగిన కార్లు ధ్వంసం, అనుమతి లేని పల్లవి ప్రశాంత్ ర్యాలీ వ్యవహారంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. ర్యాలీ సందర్భంగా జరిగిన ఘర్షణ కారణంగా గొడవలు జరిగినట్లుగా పోలీసులకు గుర్తించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తెచ్చిన ఇద్దరు కారు డ్రైవర్స్ ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ప్రశాంత్ అదేశాలతో రోడ్డుమీద కార్లను అపడంతో అభిమానులు రెచ్చిపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో ఈ కేసులో వారిని కూడా ఇద్దరు కారు డ్రైవర్స్ ను నిందితులుగా చేర్చారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో A4- సాయి కిరణ్, A.5 రాజు ఉన్నట్టు చెబుతున్నారు. మరోపక్క ఈ విధ్వంసానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు వీడియోలు అన్నిటినీ జల్లెడ పడుతున్నారు పోలీసులు.
Shah Rukh Khan Wife: డంకీ రిలీజ్ కి ముందు షాక్.. షారుఖ్ భార్యకి ఈడీ నోటీసులు
నిజానికి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు గుమికూడిన విషయం తెలిసి బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే చాలాసేపు పల్లవి ప్రశాంత్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే ఉంచి చివరికి క్రౌడ్ కంట్రోల్ చేయడం కష్టమని భావించి వెనుక గేటు నుంచి పంపించారు. అయితే అలా బయటకు వెళ్లినట్టు వెళ్లిన పల్లవి ప్రశాంత్ కాస్త సమయం ఆగి మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు వచ్చి తన అభిమానులతో కలిసి ర్యాలీ చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది, ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోమని పోలీసులు చెబుతుంటే ఒక రైతు బిడ్డకు ఇంత విలువ కూడా ఇవ్వడం లేదంటూ పల్లవి ప్రశాంత్ పోలీసులతో వాగ్వాదానికి దిగి అక్కడ నుంచి పంపించడానికి ప్రయత్నిస్తున్న పోలీసులను వీడియోలు తీయించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇక కారు డ్రైవర్లు పోలీసుల ఆదేశాలతో ముందుకు వెళుతున్నా పల్లవి ప్రశాంత్ కావాలనే డ్రైవర్ల చేత కారు ఆపిస్తూ అక్కడ అల్లర్లకు కారణమయ్యాడని పోలీసులు భావిస్తున్నారు.