షబ్బీర్ అలీ నివాసంలో అర్బన్ కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీని అర్బన్ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు అర్బన్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపు లక్ష్యంగా పని చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కామారెడ్డి వదిలి నిజమాబాద్ రావడం బాధగా ఉన్న.. మీ అభిమానం ఆనందాన్నిస్తుందన్నారు. కాళేశ్వరం లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపం వల్ల ప్రాజెక్టు కుంగిందని, కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు షబ్బీర్ అలీ.
Also Read : Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌లు ఆప్ కన్నా చిన్నవి.. మమ్మల్ని చూసి భయపడుతున్నారు..
ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, ప్రజల ప్రభుత్వం రావాలని, నిజామాబాద్ ఓటు తో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు మార్చే అవకాశం కల్పించండన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వండని షబ్బీర్ అలీ అన్నారు. స్థలం ఉన్నోళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. మైనార్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందజేస్తామన్నారు. త్వరలో రాహుల్, ప్రియాంక చేతుల మీదుగా బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు విడుదల చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లక్షల మంది పేద విద్యార్ధులు ఉన్నత చదువులు చదివారన్నారు. ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ చదివేందుకు ప్రత్యేక సాయం అందజేశామన్నారు. మైనార్టీలకు కేసీఆర్ చేసింది శూన్యమని అన్నారు. మైనార్టీలకు నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం కోసం రెండు సార్లు అప్లికేషన్లు తీసుకున్నా.. కనీసం ఒక్కరికీ కూడా సహాయం అందించలేదన్నారు.
Also Read : Arvind Kejriwal: బీజేపీ, కాంగ్రెస్‌లు ఆప్ కన్నా చిన్నవి.. మమ్మల్ని చూసి భయపడుతున్నారు..