Bomb Threats: విమానాలపై బాంబు బెదిరింపుల పరంపర ఆగడం లేదు. బాంబు బెదిరింపు కారణంగా ప్రతిరోజు విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడుతోంది. ఇందులో భాగంగా ప్రయాణీకులు కూడా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. శనివారం 10 వేర్వేరు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో ఐదు విమానాలు ఇండిగోకు చెందినవి కాగా.. ఐదు విమానాలు ఆకాసా ఎయిర్‌లైన్స్‌కు చెందినవి. సమాచారం ప్రకారం, 6E108 హైదరాబాద్-చండీగఢ్, 6E58 జెడ్డా-ముంబై, 6E17 ముంబై-ఇస్తాంబుల్, 6E184 జోధ్‌పూర్-ఢిల్లీ, 6E11 ఢిల్లీ-ఇస్తాంబుల్ విమానాలకు బాంబు బెదిరింపు వచ్చింది.…