Phone Tapping : ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫోన్ ట్యాపింగ్‌లో ప్రణీత్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1200 మంది ఫోన్లను టాప్ చేసినట్లు ప్రణీత్‌రావు పేర్కొన్నారు. జడ్జిలు రాజకీయ నేతలు ప్రతిపక్ష నేతలు కుటుంబ సభ్యులు మీడియా పెద్దలు జర్నలిస్టుల ఫోన్లు టాప్ చేసినట్లు ఆయన తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపారవేత్తలు ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లు టాప్ చేసినట్లు.. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్ లో ఉన్న ప్రణీత్‌రావు పేర్కొన్నారు. అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా అనధికారికంగా ఐదు ఫోన్లతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసినట్లు.. ఆర్థిక ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నామన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికి అనుమానం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపించామని, ఫోన్ టాపింగ్ ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసుకున్నామన్నారు. ఈ ల్యాబ్ కు సంబంధించిన శ్రీనివాస్, అనంత్ లో సహాయంతో టాపింగ్ ని విస్తృతంగా చేసామని, ప్రభాకర్ రావు సహాయంతో 17 సిస్టం ద్వారా ట్యాపింగ్ కు పాల్పడమని ప్రణీత్‌రావు తెలిపారు.
అంతేకాకుండా..’రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి టాపింగ్ చేశాం. ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి టాపిక్ ని ఆఫ్ చేసాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పాడు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్లను తీసుకువచ్చాము. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్ లు fix చేసాము. 17 హార్డ్ డిస్క్ లో అత్యంత కీలకమైన సమాచారం ఉంది. 17 హార్డ్ డిస్క్ లను కట్టర్ తో కట్ చేసి ధ్వంసం చేసాము. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్ తో ఐడి పి ఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసాం. పెన్ డ్రైవ్ లు హార్డ్ డిస్క్ లాప్టాప్స్ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లు అన్నిటిని కూడా నాగోల్ మూసారంబాగ్ మూసి లో పడవేస్తాను. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, ల్యాప్‌ట్యాప్స్.. ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మేట్ చేశాం. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌లు అన్నింటిని కూడా నాగోల్, మూసారంబాగ్ వద్ద మూసీ నదిలో పడవేశాం. ధ్వంసం చేసిన సెల్ ఫోన్లు పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేశాం. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టాపింగ్ సంబంధించిన సమాచారం ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఆ ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ వ్యవహారం నడిచింది అని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇచ్చాడు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?