NTV Telugu Site icon

TG Congress: కొలిక్కి వస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక..

T Cong

T Cong

తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వస్తుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్‌తో ఏఐసీసీ పెద్దలు ఫోన్లో మాట్లాడారు. ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. కాసేపట్లో అధిష్టానంకి మీనాక్షి నటరాజన్ నివేదిక ఇవ్వనున్నారు. కాగా.. ఒప్పందంలో భాగంగా సీపీఐకి ఒక్క ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన మూడు సీట్లలో అభ్యర్థుల ఎంపికకు సామాజిక సమీకరణాల కూర్పు చేయనున్నారు.

Read Also: Medak: మెదక్ జిల్లాలో భారీ సంఖ్యలో నాటు కోళ్లు మృతి..

ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్కటి.. బీసీ లేదా ఓసీకి సీటు కేటాయించే అవకాశం ఉంది. ఎస్సీ కోటాలో అద్దంకి దయాకర్, రాచమల్ల సిద్ధేశ్వర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఎస్టీ కోటాలో శంకర్ నాయక్ ( నల్గొండ డీసీసీ), నెహ్రూ నాయక్ (మహబూబాబాద్) పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఓసీ కోటాలో జెట్టి కుసుమ కుమార్, గాంధీ భవన్ ఇంఛార్జ్ కుమార్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా.. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి ఎమ్మెల్సీకి అవకాశం లేదు. కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు ఉన్నవారికి కూడా అవకాశం లేనట్లే.

Read Also: Chelluboyina Venu: ప్రజాజీవనాన్ని మార్చడానికి ప్రయత్నించింది వైసీపీ