Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Seethakka: స్పీకర్‌ను దూషించిన వారిని సభ నుంచి బహిష్కరించాలని మంత్రి సీతక్క శాసన మండలిలో డిమాండ్ చేశారు. మంగళవారం శాసన మండలి సమావేశాల్లో ఆమె మాట్లాడారు. మహిళా పోలీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అసభ్యంగా చేతులు వేసి నెట్టి వేశారని మండిపడ్డారు. మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు దురుసుగా వ్యవహరిస్తే.. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన, దళిత వ్యతిరేక నైజం మీది బీఆర్ఎస్దని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, అణగారిన వర్గాలు ఎదిగితే ఓర్చుకోలేని భూస్వామ్య విధానం బీఆర్ఎస్దన్నారు. మహిళా ఎమ్మెల్యేలను ముందు పెట్టి రాజకీయం ఎందుకు చేస్తున్నారని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
“కేటీఆర్ మహిళా పోలీసులపై చేతులు వేశారు. ఎస్సీ, ఎస్టీ వ్యక్తులను దూషిస్తే యాక్ట్ వర్తిస్తుంది. వీల్లకు తల్లులు లేరా.. లకారంతో ఎలా తిడుతారు? వీళ్లు తల్లులను తిడితే వారు బాధ పడరా? 2018 లో స్పీకర్‌పై దాడి చేశారని నాటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఆర్టికల్ 194 (3) ప్రయోగించి సస్పెండ్ చేశారు. అదే రూల్ బీఆర్ఎస్ సభ్యులకు వర్తింపజెయ్యాలి. అసెంబ్లీలో హరీష్ రావు స్పీకర్ పోడియం మీదకు ఉరుకుతున్నారు. ఏం.. స్పీకర్‌ను కొడుతరా? నిన్న దూషించారు.. నేడు కొడుతారా? నైతిక విలువలు ఉండాలి. సభ సంప్రాదాలు ఉండాలి. ఇప్పటి వరకు స్పీకర్‌కు క్షమాపణ చెప్పలేదు. బీఆర్ఎస్ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.” అని శాసన మండలిలో మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు.
Also Read
- Elon Musk: ఇక 5 - 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
- Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
- Rahul Gandhi New Team: రాహుల్ గాంధీ కొత్త టీమ్ రెడీ.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ
- Gold and Silver Rates Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఎంతంటే..?
తాజావార్తలు
-
Seethakka: ‘వీళ్లకు తల్లులు లేరా?’.. బీఆర్ఎస్ నేతల తీరుపై మంత్రి సీతక్క ఫైర్
-
Pralay Movie: ఈసారి ప్రళయమే.. ‘ధురందర్’ తర్వాత అదిరిపోయిన రణ్వీర్ ‘ప్రళయ్’ కొత్త లుక్..
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Karan Johar : స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్3కి కరణ్ జోహార్ ప్లాన్
-
Gaddam Prasad: ‘మీ తల్లిని అనలేదు హరీష్.. నా తల్లిని దూషించారు’.. అసెంబ్లీలో స్పీకర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!