Security Breach: ప్రధాని పర్యటనలో భద్రతా లోపం.. కాన్వాయ్‌లోకి దూసుకొచ్చిన బీజేపీ కార్యకర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Security Breach: ప్రధాని పర్యటన సందర్భంగా మరోసారి భద్రతా లోపం బయటపపడింది. శనివారం కర్ణాటకలోని దావణగెరెలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీ సందర్భంగా భారీ భద్రతా ఉల్లంఘన జరిగింది. ప్రధాని వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి భద్రతను ఉల్లంఘించగా, సకాలంలో పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తి బీజేపీ కార్యకర్తగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
కొప్పల్ మండలానికి చెందిన ఓ యువకుడు చొరబాటుదారుడిగా గుర్తించారు. పోలీసులు అతడిని ప్రశ్నించడం ప్రారంభించారు. బారికేడ్‌ను దాటేందుకు ప్రయత్నించిన వ్యక్తిని సీనియర్ పోలీసు అధికారి అలోక్ కుమార్ గుర్తించడంతో అతని వైపుకు పరిగెత్తి అతన్ని అడ్డుకున్నారు. ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కమాండో కూడా అతనిని అనుసరించారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని తిరిగి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తన ర్యాలీలో చెప్పారు. రూ.4,249 కోట్లతో 13.71 కి.మీ వైట్‌ఫీల్డ్ (కడుగోడి) నుంచి కృష్ణరాజపురం వరకు మెట్రో లైన్‌ను 12 స్టేషన్లతో శనివారం ప్రధాని ప్రారంభించారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
Read Also: Threat: జీ-20 వేదికపై భారత జెండాను తొలగిస్తామని బెదిరింపులు.. విచారణ ప్రారంభం
ప్రధాని మోదీ ర్యాలీలో భద్రతా ఉల్లంఘనలు జరగడం ఇది రెండోసారి. అంతకుముందు హుబ్లీ రోడ్ షోలో ఓ చిన్నారి ప్రధాని దగ్గరికి రావడం జరిగింది. నేషనల్ యూత్ ఫెస్టివల్ 26వ ఎడిషన్‌ను ప్రారంభించడానికి ప్రధాని మోదీ హుబ్బళ్లి-ధార్వాడ్ రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అయితే బాలుడిని భద్రతా అధికారులు ఈడ్చుకెళ్లారు.
#WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police.
(Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz
— ANI (@ANI) March 25, 2023
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్‌లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్‌లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్‌పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!