Secret Camera: ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కామాంధుల గురించిన విశేషాలు ఎక్కువగా మిడిలో కనిపిస్తున్నాయి. వావివరసలు మరిచిపోయి మహిళా అయితే చాలు అన్నట్లుగా కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు మహానగరంలోని ఓ పాపులర్ కాఫీ షాప్ లో మహిళలకు చేదు అనుభవం ఎదురైన సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..
ఓ మహిళా లేడీస్ వాష్ రూమ్ లోని డస్ట్ బిన్లో మొబైల్ రికార్డు అవుతున్న విషయాన్ని గమనించింది. దాన్ని చూసిన ఆమెకు ఒక్కసారి షాక్ కు గురైనట్లుగా జరిగింది. అయితే ఆ మహిళా వాష్ రూమ్ వెళ్లేకంటే ముందే రెండు గంటల పాటు రికార్డు అయినట్లు ఆ మహిళ గుర్తించింది. మొబైల్ రికార్డింగ్ సమయంలో ఆ మొబైల్ ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో పెట్టినట్లు తెలిపింది. ఈ సంఘటన నగరంలోని బీఈఎల్ రోడ్డులోని ఓ ప్రముఖ కాఫి షాప్ లో చోటు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో ఈ ఘటనకు సంబంధించిన ఓ పోస్టు వైరల్ గా మారింది.
Saripodhaa Sanivaaram: అక్కడ ప్రీ సేల్స్ తో అదరకొడుతున్న నాని “సరిపోదా శనివారం”..
ఆ పోస్ట్ లో బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ ఔట్ లెట్ లో ఓ మహిళకు వాష్ రూమ్ లోని డస్ట్ బిన్లో మొబైల్ కనిపించిందని., కేవలం కెమెరా మాత్రం కనిపించేలా డస్ట్ బిన్ కి ఓ చిన్న రంధ్రం ఉందని., దానిని వెంటనే గమనించిన ఆ మహిళ సిబ్బందికి చెప్పిందని., దాంతో ఈ విషయం పై అక్కడ పని చేస్తున్న ఓ ఉద్యోగి ఆ పని చేసినట్లు వారు గుర్తించారు. దాంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ వ్యక్తిని విచారించి అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తి పై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై సోషల్ మీడియా నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం పై సదరు ఔట్ లెట్ యాజమాన్యం స్పందిస్తూ.. ఇలాంటి వాటిని అసలు సహించమని, ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు చూసుకుంటామని తెలిపింది.