Jagananna Aarogya Suraksha: రేపటి నుంచి జగనన్న ఆరోగ్య సురక్షా రెండో ఫేజ్.. వైద్యారోగ్య శాఖ సర్వం సన్నద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagananna Aarogya Suraksha: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండో దశ రేపటి నుంచి ప్రారంభం కాబోతోంది. ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రజలకు సూపర్‌స్పెషాలిటీ వైద్య సేవలందించేందుకు ఈ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండో దశలో మొదటి గ్రామీణ ప్రాంతాల్లో, 3వ తేదీ నుంచి పట్టణ ప్రాంతాలలో హెల్త్ క్యాంపులు ప్రారంభం కానున్నాయి. 6 నెలల పాటు ఈ రెండో దశ కార్యక్రమం కొనసాగనుంది. దీని కోసం 13,945 ఆరోగ్య శిబిరాలను నిర్వహించేందురు ఏపీ వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంటి వద్దే పరిష్కారాన్ని, వైద్య సేవల్ని అందించాలన్నది జగన్ సర్కార్ లక్ష్యం. అవసరమైన సందర్భాలలో నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఈ బాధ్యతను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్, సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలకు అప్పగించారు. వారు చికిత్సానంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అందజేస్తారు.
Read Also: Bhavani Deeksha: ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న భవానీ దీక్షా విరమణలు
Also Read
- India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
- POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తిరుగుబాటు.. ఆర్మీ కాల్పుల్లో 30 మంది బలి..
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- Tamil Nadu: విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చిన 21 మంది ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్.. ఏం జరిగిందంటే?
మొదటి దశలో 12,423 ఆరోగ్య శిబిరాలను నిర్వహించి 1,64,982 మంది రోగులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల ద్వారా ఉచిత వైద్య సేవలను అందించింది సర్కారు. తొలిదశ కార్యక్రమంలో సీహెచ్‌వోలు, ఎఎన్ఎంలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలలలో 1,45,35,705 ఇళ్ళను సందర్శించి 6.45 లక్షల మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తొలిదశ కార్యక్రమంలో నిర్వహించిన 12,423 ఆరోగ్య శిబిరాలలో 60,27,843 మంది ప్రజలు ఓపీ సేవలు అందుకోగా, 1,64,982 మంది పేషెంట్లను ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి ఉచిత వైద్య చికిత్సను అందించారు. ఈ నేపథ్యంలో రెండో దశను మరింత విస్తృతస్థాయిలో నిర్వహించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సర్వ సన్నద్ధమైంది. వైద్యం అందించడంలో ఏ ఒక్క గ్రామాన్ని వదిలిపెట్టరాదన్న లక్ష్యంతో ప్రభుత్వం రెండో దశను నిర్వహించడానికి 6 నెలల వ్యవధిని నిర్దేశించింది.
తాజావార్తలు
-
Abhai Naveen : కథ పట్టుకెళ్తే గ్లామర్ కావాలంటారు.. హీరోయిన్ల గుట్టు విప్పిన బిగ్ బాస్ అభయ్ నవీన్!
-
Shocking Survey: మన దేశంలో ఒంటరి మహిళలు ఎక్కడ ఎక్కువో తెలుసా? జాతీయ సగటు కంటే సౌత్‌లోనే ఘోరం!
-
India: చరిత్రలో తొలిసారి, 12 అణు వార్హెడ్లను మోహరించిన భారత్..
-
Varun Tej: ‘బరి’లోకి దిగడానికి ముందే వరుణ్ తేజ్ సంచలన నిర్ణయం! డైరెక్టర్ కండిషనే కారణమా?
-
SYG: రంగంలోకి దిగిన టాలెంటెడ్ బాలీవుడ్ స్టార్!
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!