DSC 2024: నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
- నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
- ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వెరిఫికేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
DSC 2024: తెలంగాణలో డీఎస్సీ 2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సచివాలయంలో ఫలితాలను ప్రకటించిన ఆయన, దసరా పండుగకు ముందు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని వెల్లడించారు. సీఎం ప్రకటించిన ప్రకారం, టీచర్ల ఎంపిక ప్రక్రియలో విద్యాశాఖ యాక్టివ్‌గా పని చేస్తోంది. అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది. పూర్తి సమాచారం కోసం విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సిందిగా సూచించారు.
Read Also: Kolkata Rape Case: కోల్‌కతా హత్య కేసులో సీబీఐ, బెంగాల్ సర్కార్‌పై సీరియస్..
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ప్రకారం.. ఆయా జిల్లాల్లో 1:3 నిష్పత్తిలో ఎంపికైన వారికి నేటి నుంచి ఈ నెల 5 వరకు సర్టెఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. జిల్లాలు, రోస్టర్ పాయింట్ల ఆధారంగా 1:3 నిష్పత్తిలో అర్హులైన అభ్యర్థులకు ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందిస్తామని వెల్లడించారు. ఈ జాబితాలు డీఈవో వెబ్సైట్లలో ఉంటాయని పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు ఈవీ నరసింహారెడ్డి తెలిపారు. అభ్యర్థులు విద్యార్హత ధ్రువపత్రాలు, టెట్, డీఎస్సీ, కుల, 1-7 తరగతుల స్టడీ సర్టిఫికెట్ (ఒరిజినల్)లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ పత్రాలను వెంట తీసుకురావాలని చెప్పారు. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఉంచిన ఫారాన్ని నింపి తెచ్చుకోవాలని తెలిపారు.
Read Also: Work pressure: పని ఒత్తిడికి మరొకరు బలి.. బజాజ్ ఫైనాన్స్ ఉద్యోగి ఆత్మహత్య
సీఎం రేవంత్ రెడ్డి, 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ ఫలితాలను సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వంలో పదేళ్లలో కేవలం 7,000 పోస్టులే భర్తీ చేసినట్లు సీఎ వ్యాఖ్యానించారు, అయితే తమ ప్రభుత్వం కేవలం 10 నెలలలో 11,062 పోస్టులను భర్తీ చేస్తూ 56 రోజుల్లో ఫలితాలు విడుదల చేయగలిగింది. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో 65,000 ఉద్యోగాలను భర్తీ చేశామని, త్వరలో గ్రూప్-1 ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ విద్యను నిర్లక్ష్యం చేసినందున, తాము ఆ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్నామని, విద్యార్థుల సంఖ్య తక్కువ ఉందని చేసిన సాకులను ఖండించారు. గత ప్రభుత్వానికి చెందిన అన్ని అనుకూల పద్ధతులను తొలగిస్తామని, గ్రామీణ విద్యకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!