నిరుద్యోగులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ పండుగలాంటి వార్తను నారా లోకేష్ ప్రకటించారు.
అక్టోబర్ 1(నేటి) నుంచి అక్టోబర్ 5 మధ్య డీఎస్సీ క్వాలిఫై చేసిన అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరగనుంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్న ఈ వెరిఫికేషన్ స్థానిక జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో నిర్వహించబడుతుంది.
TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది.