Success Secret: టెక్ వరల్డ్ ని శాసిస్తున్న జుక్.. జాబ్స్.. గేట్స్ సక్సెస్ సీక్రెట్ ఒకటే! అదేంటంటే?
- టెక్ వరల్డ్ ని శాసిస్తున్న జుక్.. జాబ్స్.. గేట్స్
- సక్సెస్ సీక్రెట్ మాత్రం ఒకటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ పరిచయం అక్కర్లేని వ్యక్తులు కొంతమందే ఉన్నారు. ఆ లిస్టులో స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్ లు ఉన్నారు. టెక్ వరల్డ్ ని శాసిస్తు అసాధారణ విజయాలను అందుకున్నారు. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్ మేధావులు వీరు. అయితే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి విజయ రహస్యం ఉంటుంది. ఇదే విధంగా ఈ ముగ్గురు టెక్ దిగ్గజాలకు కూడా సక్సెస్ సీక్రెట్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్ సక్సెస్ సీక్రెట్ ఒకటే కావడం. ఎవరూ ఊహించని ఈ సీక్రెట్ ను కొత్త అధ్యయనం వెల్లడించింది.
Also Read:Terrorists Training In Pak: పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో సైనిక శిక్షణ
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
జి. కాస్టెల్లో కాలేజ్ ఆఫ్ బిజినెస్ పరిశోధకుల ప్రకారం, బలమైన నాయకత్వం, వ్యూహాత్మక ఆలోచన, కమ్యూనికేషన్ వంటి లక్షణాలు ఒకరి విజయానికి నిస్సందేహంగా ముఖ్యమైనవి అయితే, వారి మేధాశక్తికి దోహదపడే మరో అంశం – చేతి ఆధిపత్యం. ఇటీవల జర్నల్ ఆఫ్ బిహేవియరల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఫైనాన్స్‌లో ప్రచురించబడిన వారి పరిశోధనలు, ఎడమచేతి వాటం CEOలు వారి కుడిచేతి వాటం సహచరుల కంటే ఎక్కువ ఆవిష్కరణలు, సంస్థను విజయపథంలో నడిపిస్తారని సూచిస్తున్నాయి. స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్ లు ఎడమచేతి వాటం వారే. వీరి సక్సెస్ కు కారణం ఇదే అని భావిస్తు్న్నారు.
Also Read:PM Modi : వాడు బుడ్డోడు కాదు బుల్డోజర్… ప్రధాని ప్రశంసలు!
కుటుంబ అనుభవాలు, జన్యుపరమైన వారసత్వం, అకడమిక్ నేపథ్యం, వారు ఎంచుకున్న కెరీర్ మార్గాలు, ఇంకా మరెన్నో అంశాలు కూడా సీఈఓల విజయాలకు కారణం కావచ్చని అధ్యయన సహ రచయిత ప్రొఫెసర్ లాంగ్ చెన్ తెలిపారు. ఈ నిర్ణయానికి రావడానికి, పరిశోధనా బృందం 472 కంపెనీలలో 1,000 మందికి పైగా CEOలను విశ్లేషించింది. వారు ఫోటోలు, వీడియోలు, వాచ్ ధరించే అలవాట్లను కూడా పరిశీలించారు. ఈ టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఏ చేతికి అనుకూలంగా ఉంటారో తెలుసుకోవడానికి, కొన్ని సందర్భాల్లో వారు కంపెనీలకు నేరుగా ఫోన్ చేసి తెలుసుకునేవారు.
Also Read:Babil Khan : బాబిల్ ఖాన్ పోస్ట్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన టాలీవుడ్ డైరెక్టర్..
సీఈఓల్లో 7.9 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం వారున్నారు. లెఫ్ట్ హ్యాండ్ సీఈఓల నేతృత్వంలోని సంస్థలు గణనీయంగా అధిక సృజనాత్మక ఉత్పత్తిని ప్రదర్శించాయని అధ్యయనంలో వెల్లడైంది. ఏదైనా సంస్థ కుడిచేతివాటం ఉన్న సీఈవో నుంచి ఎడమచేతివాటం సీఈఓ చేతుల్లోకి మారిన తర్వాత ఆ సంస్థ పేటెంట్లు, ప్రశంసాపత్రాల సంఖ్య మరింత పెరుగుతోందని ఫలితాలు సూచిస్తున్నాయి. అదే సమయంలో ఎడమచేతివాటం సీఈవో నుంచి కుడిచేతివాటం సీఈఓకి మారిన కంపెనీల ఇన్నోవేషన్ అవుట్‌పుట్‌లో ఇలాంటి మార్పు కనిపించడం లేదని అధ్యయనం పేర్కొంది.
ఎడమచేతివాటం సీఈఓలు నిర్వహించే సంస్థలు ఎక్కువ మంది విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉంటుంది. వారు దేశీయ ఉద్యోగుల కంటే ఆవిష్కరణలకు ఎక్కువ దోహదపడతారని తేల్చింది.
తాజావార్తలు
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!