దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. అధిక కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో కాలుష్యాన్ని నివారించేందుకు కఠిన చర్యలు అమలు చేయడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు.. విద్యార్థుల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో ఇకపై 10-12 తరగతులు కూడా ఆన్‌లైన్‌లో ఉండాలని కోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఫిజికల్ మీడియం ద్వారా పాఠశాలకు వెళ్లేవారు. అలాగే.. ప్రభుత్వ కార్యాలయాల్లో 50 శాతం ఉద్యోగులతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.
Read Also: TTD: శ్రీవాణి ట్రస్ట్ రద్దు.. టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ, NCR పరిస్థితి చాలా దారుణంగా మారింది. అనేక ప్రాంతాల్లో AQI స్థాయి 1000 దాటింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో గ్రాప్-4ను అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా.. ఇప్పుడు 10, 12వ తరగతి పాఠశాలల విద్యార్థుల తరగతులు కూడా ఆన్‌లైన్ లో నిర్వహించేలా ఉత్తర్వులు వచ్చాయి. అయితే ఈరోజు ఈ గ్రేప్-4 అమలుకు సంబంధించిన సమావేశం రద్దయింది.
Read Also: Crime News : ఐశ్వర్య అనే యువతి మిస్సింగ్.. చెట్ల పొదల్లో నిర్జన ప్రదేశంలో మృతదేహం లభ్యం
మరోవైపు.. ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు (నవంబర్ 18) నుంచి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 4 కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. ఢిల్లీలో ట్రక్కుల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు. కేవలం నిత్యవసర సరకులు తీసుకువచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. అలాగే ఢిల్లీ వెలుపల రిజిస్ట్రేషన్ అయిన లైట్ మోటర్ గూడ్స్ వెహికల్స్‌ను కూడా నిషేధించారు. బీఎస్ 4, డీజిల్ వాహనాలను కూడా అనుమతించడంలేదు. అలాగే.. నిర్మాణాలపై తాత్కాలిక నిషేధం విధించింది ప్రభుత్వం.