SBI PO Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో మొత్తం 600 పోస్టులు భర్తీ చేయబడతాయి. వీటిలో 586 రెగ్యులర్ పోస్టులు, 14 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. SBI PO ప్రిలిమినరీ పరీక్ష 2025 మార్చి 8, 15 తేదీలలో నిర్వహించబడతుందని అధికారిక నోటిఫికేషన్‌లో వెల్లడించబడింది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 27 నుండి ప్రారంభమై, జనవరి 16, 2025 నాటికి ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన ఏదైనా సమానమైన అర్హతను కలిగి ఉండాలి. తమ గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం లేదా సెమిస్టర్‌లో ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే నిబంధనల ప్రకారం అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
Also Read: Barefoot walking: చెప్పులు లేకుండా నడవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?
SBI PO కోసం దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. అయితే SC, ST కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. SBI PO ఉద్యోగాల ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వంటి నాలుగు దశల్లో జరుగుతుంది. ఇందులో ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ భాషలో 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.
Also Read: AP Crime: ఈఎంఐ చెల్లించలేదని సాఫ్ట్‌వేర్ ఉద్యోగినికి న్యూడ్ ఫొటోలు..! ట్విస్ట్ ఏంటంటే..?
ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను రెండో దశలో మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు. మెయిన్స్ పరీక్షలో 250 మార్కుల ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. అప్పుడు మెయిన్స్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. పీఓ పోస్టుకు ఎంపికైతే, అభ్యర్థులు నెలకు రూ.48,480 బేసిక్ వేతనం పొందుతారు. SBI PO రిక్రూట్‌మెంట్ 2024 ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. ముందుగా sbi.co.in వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఆపై హోమ్‌పేజీలో SBI PO రిక్రూట్‌మెంట్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి. ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. ఇప్పుడు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. ఆపై ఆన్‌లైన్ దరఖాస్తు రుసుమును చెల్లించండి. అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి.