Saudi Arabia: మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఉన్నందున సౌదీ అరేబియా తన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉందని అరబ్ న్యూస్ నివేదించింది. సౌదీ యోగా కమిటీ ప్రెసిడెంట్ నౌఫ్ అల్-మర్వాయి ప్రకారం.. సౌదీ అరేబియాలోని ప్రధాన విశ్వవిద్యాలయాలతో రాబోయే కొద్ది నెలల్లో యోగాకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి అనేక ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. ‘విశ్వవిద్యాలయాల్లో కొత్త క్రీడల అభివృద్ధి, ప్రచారం’ పేరుతో జరిగిన సెషన్‌లో యోగా ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, యోగాను యూనివర్సిటీల్లో పరిచయం చేయడానికి సౌదీ యోగా కమిటీ తీవ్రంగా కృషి చేస్తోంది. యోగా అభ్యాసకులకు శారీరక, మానసిక శ్రేయస్సు రెండింటికీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని సౌదీ యోగా కమిటీ ప్రెసిడెంట్ నౌఫ్ అల్-మర్వాయి తెలిపారు.
Read Also: Venkaiah Naidu: యువతకు వెంకయ్యనాయుడు సందేశం.. రాజకీయాల్లోకి రావాలంటూ..
కొంతమంది నమ్ముతున్నట్లుగా యోగా కేవలం ధ్యానం, విశ్రాంతి మాత్రమే కాదని.. ఆసనాలు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తాయని ఆమె వెల్లడించింది. విద్యా మంత్రిత్వ శాఖ సహకారంతో సౌదీ యూనివర్సిటీస్ స్పోర్ట్స్ ఫెడరేషన్ నిర్వహించిన ‘క్రీడల్లో కింగ్‌డమ్ విజన్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వవిద్యాలయ క్రీడల పాత్ర’ అనే ఫోరమ్‌లో ఇటీవల రియాద్‌లో ఈ ప్రకటన చేయబడింది.ఇంటర్నేషనల్ యూనివర్శిటీస్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లియోంజ్ ఈడర్, ఇంటర్నేషనల్ యూనివర్శిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ పాలో ఫెరీరా నేతృత్వంలో అనేక మంది యూనివర్సిటీ స్పోర్ట్స్ నిపుణులు, అంతర్జాతీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని అరబ్ న్యూస్ నివేదించింది.