వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా ఆమె మాట్లాడుతూ.. మహబూబాబాద్ ఎమ్మెల్యే, ఎంపీలపై దురుసుగా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమంకు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఏ మొహం పెట్టుకొని వస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో కోట్ల రూపాయలు సంపాదించి.. వేరే రాజకీయ పార్టీ పెట్టుకొని ఊరేగుతున్నారని ఆమె మండిపడ్డారు. డిపాజిట్లు రాని వారు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి కోసమే ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ లో చేరారన్నారు. మీలాగా అక్రమ సంపాదన కోసం పార్టీలు మారలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Mahanandi Temple: శంభో శివశంభో.. భక్తులతో పోటెత్తిన మహానంది
ప్రజా సంక్షేమం, అభివృద్దే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి సత్యవతి వ్యాఖ్యానించారు. ఇవ్వాళ మీరు ఈ స్థితిలో ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే.. అలాంటి రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి.. ఆ పార్టీ ద్వారా సంపాదించుకున్న వేల కోట్లతో వేరే పార్టీ పెట్టి ఊరేగుతున్నది మీరు కాదా అని షర్మిలను మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికైనా పరిమితుల మేరకు పాదయాత్ర చేసుకోవాలని షర్మిలకు సూచించారు. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు.
Also Read : Tarakaratna Family: తాత అంటే ఇష్టం.. ఆయన పేరు కలిసొచ్చేలా బిడ్డలకు పేర్లు