Tarakaratna Family: నలభై ఏళ్ల వయసులోనే నింగికెగిసిన నందమూరి తారకరత్నకు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం నివాళులర్పిస్తోంది. జనవరి నెల 27న కుప్పంలో నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. 23రోజుల పాటు బెంగళూరు నారాయణ హృదయాలయలో మృత్యువుతో పోరాడుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనతో ఆయన కుటుంబం అంతులేని విషాదంలో మునిగిపోయింది. ఇండస్ట్రీలోని ప్రముఖులతో పాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు తారకరత్న ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా అందిస్తున్నారు.
Read Also: Tarakaratna Political: ఎమ్మెల్యే టికెట్ ఇద్దామనుకున్నా.. ఇంతలోనే ఇలా
సినీ ఇండస్ట్రీలో తారకరత్న సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏ ఈవెంట్స్‌కి వెళ్లినా తన తాతగారు, బాబాయ్ గొప్పదనం గురించి చెప్పేవారు. కుటుంబం అంటే తారకరత్నకు అంత ఇష్టం. తారకరత్నకు తన తాత సీనియర్ ఎన్టీఆర్ అంటే అమితమైన ప్రేమ. అందుకు తన పిల్లలకు తాత ఎన్టీఆర్ పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టారు. తాను అలేఖ్య రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబానికి దూరంగా ఉంటున్నప్పటికీ వారంతే తారకరత్నకు అమితమైన అభిమానం. తారకరత్నకు మొత్తం ముగ్గురు పిల్లలు. మొదటగా కుమార్తె పుట్టగా నిష్క అని పేరు పెట్టుకున్నాడు. ఆ తర్వాత కవలలు పుట్టారు. వారిలో ఒకరు అబ్బాయి. మరొకరు అమ్మాయి. వీరికి తాన్యారామ్, రేయా అని పేర్లు పెట్టారు. వీరి పేర్లలోని మొదటి ఇంగ్లీష్ అక్షరాలు ఎన్టీఆర్ అని వచ్చే విధంగా తారకరత్న దంపతులు పెట్టుకున్నారు.
Read Also: Taraka Ratna: తారక రత్న భౌతికకాయానికి నివాళులు అర్పించిన కొడాలి నాని…