శనివారం ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామికి మహా ప్రీతికరమైన రోజు.. అందుకే భక్తులు ఈరోజు ఆయన భక్తితో పూజిస్తారు.. శనివారం స్వామివారు విశేష పూజలను అందుకుంటారు. అంతేకాకుండా శనీశ్వరుడు శనివారానికి అధిపతి. కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవంగా ఆ వెంకటేశ్వర స్వామిని భక్తులు పూజిస్తారు. మనం ఏదైనా కోరికను కోరుకొని 7 శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతమాచరిస్తే మనం కోరుకునే కోరికలు నేరవేరుతాయని పండితులు చెబుతున్నారు.. ఎలా వ్రతాన్ని చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
శనివారం ఉదయం ఐదు గంటలకు ముందే లేవడం మంచిది.. స్నానాలు ఆచరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక అలంకరణలతో పూజించాలి. ఆ తరువాత బియ్యపు పిండి, పాలు,అరటి పండు ముక్కలు వేసి ముద్దగా కలుపుకున్న పిండిని తర్వాత ఒక ప్రమిదల తయారు చేసుకోవాలి.. ఆ ప్రమిదలో నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి తులసి కోట ముందు ఏడు వత్తులతో దీపం వెలిగించాలి..
అంతే కాకుండా శనివారం సాయంత్రం ఇదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి నందు దీపారాధన చేయాలి.ఈ విధంగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని ఆచరించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా అష్టైశ్వర్యాలను పొందుతారు అని పండితులు చెబుతున్నారు.. అంతేకాదు శని ప్రభావం కూడా తగ్గిపోతుంది.. ఏళ్ల నుంచి మనల్ని వెంటాడుతున్న శని బాధలు కూడా తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా నియమనిష్టలతో 7 వారాలు ఇలా చేస్తే వెంకన్న ఆశీస్సులు మనపై ఉంటాయని పండితులు చెబుతున్నారు..