Sashivadane: ‘పలాస 1978’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు సంపాదించిన రక్షిత్ అట్లూరి హీరోగా, ‘హిట్’ సిరీస్‌తో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించిన కోమలి హీరోయిన్‌గా నటించిన కొత్త సినిమా ‘శశివదనే’. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం నేటి నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. రవితేజ బెల్లంకొండ నిర్మించారు.
READ ALSO: Congress: ‘‘ వరసగా 6 ఎన్నికల్ని ఓడిపోయాం’’.. రాహుల్ గాంధీ, ఖర్గేలపై సోనియా గాంధీకి లేఖ..
నిజానికి మేకర్స్ ఈ చిత్రాన్ని ఒక విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కించారు. రాఘవ (రక్షిత్) గోదావరి లంక గ్రామంలో తన తండ్రి (శ్రీ మాన్)తో కలిసి జీవనం సాగిస్తూ ఉంటాడు. అనుకోకుండా రాఘవ పక్కూరికి చెందిన ఓ అమ్మాయి(కోమలి ప్రసాద్)ని చూసి, మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. అలా, పేరు తెలుసుకునే క్రమంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, వారిద్దరి మధ్య ప్రేమ ఎంత దూరం వెళ్లింది, కులాలు వేరు కావడంతో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ.
READ ALSO: Khaleda Zia: ప్రాణం కోసం పోరాడుతున్న బంగ్లా మాజీ ప్రధాని..