Site icon NTV Telugu

Saraswati Pushkaralu : తెలంగాణలో రెండోరోజు సరస్వతి పుష్కరాలు.. తొలిరోజు లక్ష మందికి పైగా భక్తుల పుష్కర స్నానాలు

Saraswati Pushkaralu

Saraswati Pushkaralu

Saraswati Pushkaralu : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాలు రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. ఇక్కడ గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొదటి రోజు లక్ష మందికి పైగా భక్తులు పుష్కర స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరంలో కుంభమేళాను తలపించేలా టెంట్‌ సిటీని ఏర్పాటు చేశారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించడానికి ప్రత్యేక ఘాట్‌లను సిద్ధం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Israel-Hamas: గాజాలో ఇజ్రాయెల్ బాంబుల మోత.. 80 మంది పౌరులు మృతి..!

పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తోంది. తాగునీరు, వైద్య సదుపాయం, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో కూడా భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పుష్కరాలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు. భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పుష్కరాల్లో పాల్గొంటున్నారు.

IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఆరుగురు మ్యాచ్ విన్నర్స్ తిరిగొచ్చేశారు!

Exit mobile version