ఈ వీకెండ్ ఇంట్లో అందరూ కలిసి కూర్చుని, హాయిగా నవ్వుకుంటూ చూసే ఒక మంచి సినిమా కోసం వెతుకుతున్నారా? అయితే అమెజాన్ ప్రైమ్ మరియు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా నీ కోసమే. ఇది పక్కా మన నేటివిటీ ఉన్న స్వచ్ఛమైన తెలుగు ఫ్యామిలీ డ్రామా. ఓటీటీలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే ఈ సినిమా 50 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ లేవు కాబట్టి, ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. ఇక,
Also Read : Prabhas-Riddhi : ప్రభాస్ శారీ గిఫ్ట్ వెనుక స్టోరీ ఇదే.. క్లారిటీ ఇచ్చిన రిద్ధి కుమార్
అసలు కథ విషయానికి వస్తే.. మన మిడిల్ క్లాస్ ఇళ్లలో ఉండే చిన్న చిన్న గొడవలు, ఆప్యాయతలు ఎంత బాగుంటాయో ఇందులో భలే చూపించారు. హీరో చైతన్య (విక్రాంత్), కళ్యాణి (చాందిని చౌదరి)ని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి (మురళీధర్ గౌడ్)కి ఇష్టం లేకపోయినా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు. తనను, తన భార్యను ఎవరూ విడదీయలేరని మామగారికి సవాల్ విసిరిన హీరో, పిల్లలని కని తన ప్రేమను నిరూపించుకోవాలనుకుంటాడు. కానీ, సంతానం కలగడమే పెద్ద సమస్యగా మారితే పరిస్థితి ఏంటి? నేటి సమాజంలో పెరిగిపోతున్న ‘మేల్ ఇన్ఫెర్టిలిటీ’ (పురుషుల్లో సంతానలేమి) సమస్యను బేస్ చేసుకుని ఈ సినిమాను రూపొందించారు. నిజానికి..
వినడానికి ఇది సీరియస్ పాయింట్లా అనిపించినా, దర్శకుడు సంజీవ్ రెడ్డి దీన్ని చాలా ఫన్నీగా, ఎంటర్టైనింగ్గా తీశాడు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ అదిరిపోయింది. హీరో తన సమస్యను దాచిపెట్టే క్రమంలో పడే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. మన ఇంట్లో మాట్లాడుతున్నట్టు ఉండే డైలాగ్స్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. కామెడీతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ కూడా ఉంది కాబట్టి, ఈ వీకెండ్ ఈ క్లీన్ ఎంటర్టైనర్ను అస్సలు మిస్ అవ్వకండి.