Sanjay Dutt: పొలిటికల్ ఎంట్రీపై సంజయ్ దత్ ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల్లో సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఆయా పార్టీలు కూడా సీట్లు ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంలో కూడా దూసుకెళ్తున్నారు. ఇటీవల బాలీవుడ్ హ్యాసనటుడు గోవింద్ కూడా రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. షిండేకు చెందిన శివసేన పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తారని తెలిసింది. గతంలో 2004 నుంచి 2009 వరకు ఎంపీగా పని చేశారు. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక బాలీవుడు భామలు కంగనా రనౌత్, నవనీత్ కౌర్‌లు బీజేపీ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కంగనా హిమాచల్‌ప్రదేశ్ నుంచి మండీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక నవనీత్ కౌర్ అమరావతి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కూడా రాజకీయల్లోకి వస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంజయ్ దత్ స్పష్టం చేశారు.
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తనకు లేదని సంజయ్ దత్ పేర్కొన్నారు. ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తానే ప్రకటిస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి వస్తాననే వదంతులకు స్వస్తి పలకాలని కోరారు. ఏ పార్టీలోనూ చేరడం లేదని.. దయచేసి అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చేశారు.
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో హరియాణాలోని కర్నాల్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు పోటీగా సంజయ్‌ను బరిలోకి దింపేందుకు హస్తం పార్టీ సిద్ధమవుతున్నట్లు కొంతకాలంగా ఊహగానాలు వచ్చాయి. ఈ వదంతులపై తాజాగా సంజయ్ దత్ సమాధానం ఇచ్చేశారు.
సంజయ్‌దత్‌పై గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. 2019 ఎన్నికల సమయంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు సంజయ్ రాజకీయాల్లో వస్తున్నారని వ్యాఖ్యానించారు. స్పందించిన సంజయ్ అప్పుడూ ఇదే సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఆయన తండ్రి సునీల్‌దత్ గతంలో కాంగ్రెస్ ఎంపీగా పని చేశారు. మన్మోహన్ సింగ్ హయాంలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆయన సోదరి ప్రియాదత్ సైతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఇక 1993 ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలో నిందితుల నుంచి అక్రమంగా ఆయుధాలను తీసుకున్న కేసులో సంజయ్ దోషిగా తేలారు. నేరం రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించారు. 2016లో జైలు నుంచి విడుదలయ్యారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం అవుతోంది. సెకండ్ విడత ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇక విజయంపై ఆయా పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
I would like to put all rumours about me joining politics to rest. I am not joining any party or contesting elections. If I do decide to step into the political arena then I will be the first one to announce it. Please refrain from believing what is being circulated in the news…
— Sanjay Dutt (@duttsanjay) April 8, 2024
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!