Uday Kiran Organ Donation: ఆ యువకుడి ముందు చావు కూడా చిన్నబోయింది.. 8 మందికి పునర్జన్మనిచ్చిన 22 ఏళ్ల యువకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uday Kiran Organ Donation: తమ బిడ్డ చేతికి అందివచ్చే వయసులో కన్నుమూస్తే.. పుట్టెడు దు:ఖంలో కూడా ఆ తల్లిదండ్రులు మానవత్వంతో ఆలోచించారు. తమ బిడ్డ చనిపోతూ మరో ఎనిమిది మంది రూపంలో బ్రతికి ఉండాలని నిర్ణయించుకున్నారు. రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక యువకుడి అవయవాలను దానం చేసి, ఎనిమిది మందికి పునర్జన్మని ప్రసాదించి అందరికీ ఆదర్శంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. వివరాల్లోకి వెళ్తే..
Also Read
- Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
- IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
- Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
అనుకోని ప్రమాదం.. అంతా చిన్నాభిన్నం
సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిరణ్ (22) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. అయితే విధి ఆ యువకుడిపై కన్నెర్ర చేసింది. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ నిజాంపేట బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా ఉదయ్ కిరణ్‌కు ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతడి తలకు తీవ్ర గాయమైంది.
బ్రెయిన్ డెడ్ అని తేల్చిన వైద్యులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారం రోజుల పాటు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ నెల 11న ఉదయ్ కిరణ్ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు వెల్లడించారు. చేతికి అందిన కొడుకు ఇక తిరిగి రాడని తెలిస్తే.. కన్నపేగు దు:ఖం వర్ణించడం మాటలకు అంతుందా. అంతటి దు:ఖంలోనూ ఆ తల్లిదండ్రులు.. ఒక మహోన్నత నిర్ణయాన్ని తీసుకున్నారు. తమ బిడ్డ తమకు దూరం అయిన అవయవదానం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇస్తాడని వైద్యుల సూచన మేరకు అవయవదానానికి అంగీకరించారు. ఉదయ్ కిరణ్ గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి అవయవాలను వైద్యులు సేకరించి అవసరమైన రోగులకు అమర్చారు. దీంతో ఎనిమిది మంది మృత్యువు అంచున ఉన్న రోగులకు ఉదయ్ కిరణ్ ద్వారా కొత్త జీవితం లభించింది.
అవయవదానం అనంతరం ఉదయ్ కిరణ్ పార్థివ దేహాన్ని సొంత గ్రామమైన కొత్లాపూర్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. చేతికి అందివచ్చిన కొడుకు, శవంగా ఇంటికి వస్తే ఆ కుటుంబంతో పాటు గ్రామం మొత్తం కంటతడి పెట్టుకుంటూ ఉదయ్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తమ గ్రామానికి చెందిన యువకుడు ఎనిమిది మంది ప్రాణాలు కాపాడాడని తెలిసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మరణంలోనూ మరో ఎనిమిది మందిని బ్రతికిస్తున్న ఉదయ్ కిరణ్ ఇప్పుడు ఆ జిల్లాలో రియల్ హీరోగా నిలిచాడు.
READ ALSO: PM Modi: మహిళా రిజర్వేషన్లపై ప్రధాని కీలక ప్రకటన.. జనాభా గణనతో పనిలేదు.. 2011 గణాంకాలతోనే అమలు!
తాజావార్తలు
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!