NTV Telugu Site icon

Sandra Venkata Veeraiah: తక్షణమే బండి సంజయ్‌ను అరెస్ట్ చేయాలి

Sandra

Sandra

ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసన ర్యాలీ కార్యక్రమంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. స్వాతంత్రం అనంతరం ఏర్పడిన ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయటం, తనకు నచ్చని వారిపై సీబీఐ, ఈడీలను ప్రయోగించడం, నచ్చని పార్టీలపై ఉక్కు పాదం మోపటం, ఎన్నికల సంఘాన్ని కూడా గుప్పెట్లో పెట్టుకోవటం, అదానీ, అంబానీ సంస్థలకు బీజేపీ ప్రభుత్వం దోచి పెడుతుందని ఆయన అన్నారు.

Also Read : Swati Maliwal : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. మహిళ కమిషన్‌ చీఫ్‌ సంచలనం

అంతేకాకుండా.. ‘భారత సంప్రదాయంలో మహిళలకు అత్యంత గౌరవం ఉంది. ఢిల్లీ వేదికగా యావత్ భారతదేశం లోని మహిళ లోకానికి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమాలను చూసి ఓర్వలేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. బీజేపీ చెప్పు చేతల్లో నడుస్తున్న ఈడిని ప్రయోగించి ఎమ్మెల్సీ కవితపై అక్రమ కేసులను బనాయించారు. హద్దు మీరి సంస్కారాన్ని మరిచి సాంప్రదాయాన్ని మరిచి ఓ పార్లమెంట్ సభ్యుడి స్థానంలో ఉండి అత్యంత హీనకరమైన భాషలో బండి సంజయ్ కవిత పై మాట్లాడుతున్నారు. మహిళ అని చూడకుండా అవమానపరిచే విధంగా ఏదైతే మాట్లాడారో దానికి క్షమాపణ చెప్పాలి.

Also Read : Breast Cancer : రొమ్ము క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను తెలుసుకోండి

తక్షణమే బండి సంజయ్ ను అరెస్ట్ చేయాలి. ఇప్పటికే అనేకసార్లు సమాజాన్ని చిల్చే విధంగా, రెచ్చగొట్టే విధంగా సమాజంలో సామరస్యం దెబ్బతినేలా బండి సంజయ్ వ్యవహరించారు. దుందుడుకు మాటలతో, దుర్మార్గకరంగా చేస్తున్న ఆలోచనలను ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో బీజేపీ పార్టీ శక్తి ఏంటో బలం ఎంటో ప్రజలకు తెలుసు. అక్రమంగా కేసులు పెట్టి కవితను వేధిస్తున్నారు.’ అని ఆయన అన్నారు.