Swati Maliwal : మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు.. మహిళ కమిషన్ చీఫ్ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) వార్షిక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నతనంలో తన తండ్రి తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె శనివారం వెల్లడించారు. “చిన్నతనంలో మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను కొట్టి పందెం కాసేవాడు. నేను మంచం కింద దాక్కున్నాను… నాకు ఇప్పటికీ గుర్తుంది, అతను నన్ను నా జుట్టు పట్టుకుని లాగి గోడకు కొట్టేవాడు” అని మలివాల్ చెప్పింది.
Also Read : Madhave Madhusudana: కొడుకు కోసం మెగా ఫోన్ పట్టిన మేకప్ మ్యాన్!
Also Read
- AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
- Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
- OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
- Story Board: ఇప్పుడు ధనుష్.. నిన్న విజయ్.. సినిమా వాళ్లు లేకుండా తమిళ రాజకీయం నడవదా..?
స్వాతి మలివాల్ ఇంకా మాట్లాడుతూ, “మంచం కింద దాక్కుని, మహిళలు తమ హక్కులను సాధించుకోవడానికి నేను ఎలా సహాయం చేయాలో నిర్ణయించుకున్నా.. ఇలా మహిళలు, బాలికలపై దాడులు చేసే వారికి గుణపాఠం చెప్పాలని నేను ఆలోచించాను.’ అని అన్నారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. తాను నాలుగో తరగతి వరకు తన తండ్రి దగ్గరే ఉండేదానినని, ఆ సమయంలో అతను తనపై చాలాసార్లు దాడి చేశాడని ఆమె వెల్లడించారు.
Also Read : Raj Bhavan : రాజ్ భవన్ వద్ద ఉద్రిక్తత.. మేయర్ అరెస్ట్
అయితే. ఈ అవార్డు వేడుకలో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ DCW అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డుల విజేతలను సత్కరించారు. ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ (డీసీడబ్ల్యూ) ఏర్పాటు చేసిన అవార్డులను దాదాపు 100 మంది మహిళలు కైవసం చేసుకున్నారు. మహిళల పట్ల అసాధారణ ధైర్యాన్ని, నిబద్ధతను ప్రదర్శించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.
Also Read : Topless At Public Swimming: టాప్‌లెస్‌గా మహిళల స్విమ్మింగ్‌కు అనుమతి.. ఏ దేశంలో తెలుసా..?
సభను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ, “మొత్తం 365 రోజులు (సంవత్సరంలో) మహిళల కోసం జరుపుకోవడానికి ఇది ప్రత్యేకమైన రోజు. వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఈరోజు ఈ కార్యక్రమంలో 104 ఏళ్ల వృద్ధులు, 106 ఏళ్ల వృద్ధులను సన్మానించారు. మనం వారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈ రోజు, DCW అవార్డులు ప్రతిష్టాత్మక అవార్డుగా మారాయి. అవార్డు గెలుచుకున్న వారందరికీ అభినందనలు” తెలిపారు.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!