Samyuktha Menon: అందమే కాదు మనసు కూడా వెన్నే.. విరూపాక్ష బ్యూటీపై నెటిజన్లు ఫిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samyuktha Menon: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరంటే సంయుక్త మీనన్ అనే చెప్పాలి. భీమ్లా నాయక్, బింబిసార లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. తాజాగా ఆమె నటించిన విరూపాక్ష సినిమా బాక్సాఫీసు వద్ద భారీగా కలెక్షన్లు రాబట్టుతోంది. సాయి ధరమ్ తేజ్, సంయుక్త ఇద్దరి కెరీర్లో విరూపాక్ష సినిమా ఓ మైలు స్టోన్ గా మిగిలిపోతుంది. ఆమె నటించిన మూడు సినిమాలు కూడా సూపర్ హిట్గా నిలవడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటుంది.
Read Also:Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
తెలుగుతో పాటు అంతకుముందు మలయాళం, కన్నడ, తమిళ్ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా విజయాలు రావడంతో ఆమెది గోల్డెన్ హ్యాండ్ గా మారిపోయింది. దాంతో దర్శక నిర్మాతల ఫస్ట్ చాయిస్ సంయుక్తనే. సంయుక్త నటిస్తే ఆ సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం ప్రేక్షకులలో కూడా నెలకొంది. కేవలం అందం అభినయం మాత్రమే కాకుండాతన మనసు కూడా గొప్పదని ఆమె నిరూపించుకుంది. తాజాగా ఆమె చేసిన ఒక గొప్ప పని ప్రేక్షకులలో ఆమె స్థానం మరింత పెరిగింది. విరూపాక్ష మూవీ యూనిట్‌తో కలసి ఓంకార్ నిర్వహిస్తున్న సిక్త్ సెన్స్ లో సంయుక్త పాల్గొన్నారు. ఈ షోలో అన్ని టాస్క్‌లు గెలిస్తే స్కూటీ ఇస్తానని ఓంకార్ మాట ఇచ్చారు.
Read Also:Viral : ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. డ్యాన్స్ తో అదరగొట్టేశారుగా..
విరూపాక్ష చిత్ర యూనిట్ ఆ స్కూటీని గెలిస్తే అక్కడున్న విద్యార్థుల్లో ఎవరికో ఒకరికి ఇచ్చేస్తామని చెప్పారు. అన్ని టాస్కుల్లోనూ గెలవడంతో ఓం కార్ ఒక స్కూటీని ఇచ్చారు. ఈ స్కూటీని ఎవరికీ ఇస్తారు అని ఓంకార్ అడిగారు.. సంయుక్త నేను సెలెక్ట్ చేస్తానంటూ స్టూడెంట్స్‌లో ఇద్దర్ని ఎంపిక చేశారు. సింగల్ పేరెంట్ ఎవరికీ వున్నారు అని మళ్లీ రెండో ప్రశ్న అడగగా ఇద్దరికి లేరు అని తెలిసింది. దీంతో ఆ ఇద్దర్ని స్టేజి పైకి పిలిచి వారిలో ఒకరికి ఆమె స్కూటీ ఇచ్చేశారు. మరో అమ్మాయికి నువ్వేం భయపడకు నేనే నీకు స్కూటీ కొనిస్తాను అంటూ హామీ ఇచ్చింది. దాంతో ఆ విద్యార్థులు సంయుక్తను కౌగిలించుకుని కృతజ్ఞతలు తెలిపారు. బ్యూటీ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Very smart & kind hearted woman @iamsamyuktha_ take a bow 🙇♂️ 👏#Virupaksha #Samyukthamenon pic.twitter.com/K8ZT3lqghq
— Plant Soldier (@CM_Lokeshh) May 1, 2023
తాజావార్తలు
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!