Medchal news: మేడ్చల్ లో దారుణం.. మ్యాన్ హోల్ లో బాలుడి మృతదేహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medchal news: మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో సంతోష్ అనే బాలుడి మృతదేహం కలకలం రేపింది. కొండాపూర్‌లోని వాసవి వెంచర్‌లోని మ్యాన్‌హోల్‌లో మృతదేహం లభ్యమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలుడి మరణానికి కారణం ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు.
మూడు రోజుల క్రితం వర్షం కురుస్తున్న సమయంలో సంతోష్ బయటకు వెళ్లాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే బాలుడు ఎక్కడా కనిపించకపోవడంతో భయాందోళనకు గురై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు బాలుడి అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే సమీపంలోని కొండాపూర్ చెరువులో జారిపడి ఉండవచ్చన్న అనుమానంతో రెస్క్యూ టీంలు రెండు రోజులుగా చెరువులో సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు చెరువులోకి గజ ఈతగాళ్లను ప్రయోగించి బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నిన్న వాసవీ వెంచర్‌లో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తల్లిదండ్రులను పిలిపించి మృతదేహాన్ని చూపించారు. మూడు రోజుల క్రితం అదృశ్యమైన సంతోష్ అనే బాలుడి మృతదేహంగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం సంతోష్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read
అయితే బాలుడు ఎలా మృతి చెందాడనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎవరైనా హత్య చేసి మ్యాన్‌హోల్‌లో పడవేశారా? లేక ఆ బాలుడు వర్షంలో జారి మ్యాన్‌హోల్‌లో పడ్డాడా? పోలీసులు విచారిస్తున్నారు. అయితే మూడు రోజుల క్రితం కుండపోత వర్షం కురుస్తుండడంతో బాలుడు బయటకు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఇంటికి రాలేదని చెబుతున్నారు. ప్రమాదవశాత్తు బాలుడు మ్యాన్‌హోల్‌లో జారిపడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంటికి దూరంగా ఉన్న మ్యాన్ హోల్ వద్దకు బాలుడు ఎలా వెళ్లాడు అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు.
Jagtial News: ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి.. బస్సులో 75 మంది ప్రయాణికులు
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!