Samsung unveils Galaxy S24 Yellow Colour Variant: దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ శాంసంగ్.. తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్24 అల్ట్రా’ను కొత్త కలర్ వేరియంట్‌లో విడుదల చేసింది. టైటానియం యెల్లోను కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. దాంతో ఈ ఫోన్ ఏడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ టైటానియం గ్రే, టైటానియం బ్లాక్, టైటానియం వయొలెట్, టైటానియం ఆరెంజ్, టైటానియం బ్లూ, టైటానియం గ్రీన్ రంగుల్లో అందుబాటులో ఉంది. కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
గెలాక్సీ ఎస్24 అల్ట్రా టైటానియం యెల్లో వేరియంట్ కాన్ఫిగరేషన్‌లో ఎటువంటి మార్పు లేదు. 12జీబీ+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 1,29,999 కాగా.. 12జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,39,999గా ఉంది. ఇక 12జీబీ+1టీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,59,999కు పొందవచ్చు. మీరు ఈ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అధికారిక స్టోర్ నుండి కొనుగోలు చేయవచ్చు. యెల్లో వేరియంట్ ఇతర కలర్ ఆప్షన్ల మాదిరిగానే.. లుక్, స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. అన్నిటికంటే యెల్లో వేరియంట్ లుక్ అదిరిపోయింది.
Also Read: Today Gold Price: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! అస్సలు ఊహించరు
గెలాక్సీ ఎస్24 అల్ట్రాలో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.8 ఇంచెస్ క్యూహెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2X LTPO ఫ్లాట్ డిస్‌ప్లేను ఇచ్చారు. వన్ యూఐ 6.1తో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 200MP ఓఐఎస్+ 12MP అల్ట్రావైడ్+ 50MP 5x టెలిఫొటో OIS+ 10MP 3x పెరిస్కోప్ జూమ్ లెన్స్ కెమెరాను ఇవ్వగా.. ముందు భాగంలో 12MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక 45వాట్ వైర్డ్, 15 వాట్ వైర్‌లెస్, 4.5 వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.