Samsung Mobile Alert: మీరు శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అప్డేట్ తప్పనిసరి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samsung users to update their smartphones: మీరు ‘శాంసంగ్’ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా?.. అయితే మీకు కేంద్ర ప్రభుత్వం ఓ అలర్ట్ జారీ చేసింది. శాంసంగ్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌లో సెక్యూరిటీ లోపాన్ని గుర్తించామని, వెంటనే తమ ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. ఆండ్రాయిడ్ 11, 12, 13, 14 ఓఎస్‌తో పనిచేసే శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌లో భద్రతాపరమైన లోపం ఉందని, వ్యక్తిగత డేటాను హ్యాకర్లు దొంగిలించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌ను లేటెస్ట్ సెక్యూరిటీ అప్డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) సూచించింది.
నాక్స్ ఫీచర్లపై కంట్రోలింగ్ లేకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌లో లోపాలు, ఏఆర్ ఎమోజీ యాప్‌లో ఆథరైజేషన్ సమస్యలు, నాక్స్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌లో లోపాలను సరిదిద్దకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తిందని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు భద్రతాపరమైన అడ్డంకులు అధిమించి.. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం పొంచి ఉంది. లోపాలను గుర్తించి చొరబడితే.. డివైజ్ పిన్ను, ఏఆర్ ఎమోజీ సాండ్‌బాక్స్ డేటాను అటాకర్లు రీడ్ చేయగలరని సెర్ట్-ఇన్ తెలిపింది. సిస్టమ్ టైమ్‌ను మార్చి నాక్స్ గార్డ్ లాక్‌ను బైపాస్ చేయగలరని.. అర్బిట్రరీ ఫైల్స్, సున్నితమైన సమాచారాన్ని తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది.
Also Read
- Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
- Mohammed Siraj: ఆటో డ్రైవర్ కొడుకు నుంచి స్టార్ బౌరల్, డీఎస్పీ వరకు.. హైదరాబాద్ 'మియా భాయ్' సక్సెస్ స్టోరీ!
Also Read: Suryakumar Yadav: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!
శాంసంగ్ లేటెస్ట్ స్మార్ట్ఫోన్లు అయిన గెలాక్సీ ఎస్23, గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5, గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 సహా ఆండ్రాయిడ్ 11, 12, 13, 14లలో లోపం ఉన్నట్లు సెర్ట్-ఇన్ తెలిపింది. యూజర్లు ఫోన్ సెట్టింగ్స్‌లోని అబౌట్ డివైజ్‌లోకి వెళ్లి.. లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించింది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడు ఫోన్ అప్డేట్ చేసుకోవాలని టెక్ నిపుణులు అంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను అస్సలు క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
-
Naga Vamsi: ‘ఇది అంత కలర్‌ఫుల్ ఫీల్డ్ కాదు’.. సినిమా ఇండస్ట్రీపై నాగవంశీ కామెంట్స్ వైరల్!
-
Donald Trump: సుప్రీంకోర్టు తీర్పుతో ఆగని ట్రంప్.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై మరోసారి సంచలన నిర్ణయం
-
Partition 1947: ‘పార్టిషన్ 1947’ ప్రమోషన్లో కలకలం.. యువకుడికి ప్రమాదం.. యోగిని కలిసిన సన్నీ, ప్రీతి
-
Fortune Sunflower Oil FSSAI: ఈ వంట నూనె వాడుతున్నారా?.. ఫార్చ్యూన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ శాంపిల్ ల్యాబ్ పరీక్షలో విఫలం..!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!