దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ‘శాంసంగ్’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎస్ సిరీస్‌లో భాగంగా శాంసంగ్ గెలాక్సీ ఎస్25, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ప్లస్ సిరీస్ ఫోన్‌లను విడుదల చేసింది. ‘గెలాక్సీ అన్‌ప్యాక్డ్’ పేరుతో కాలిఫోర్నియాలో బుధవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) జరిగిన ఈవెంట్‌లో శాంసంగ్ ఈ మూడు ప్రీమియం ఫోన్‌లను లాంచ్ చేసింది. ఎస్25 అల్ట్రా ధర భారత్‌లో రూ.1,29,999 నుంచి ప్రారంభం కానున్నాయి.
Samsung Galaxy S25 Ultra:
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా మూడు వేరియెంట్లలో లభించనుంది. 12జీబీ+256జీబీ, 12జీబీ+51జీబీ, 12Gజీబీ+ 1టీబీతో కంపెనీ లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధరలు రూ.1,29,999 నుంచి ప్రారంభం కానున్నాయి. టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్‌బ్లూ, వైట్ బ్లూ రంగుల్లో ఇది లభిస్తాయి. ఇందులో 6.9 ఇంచెస్ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే ఉండగా.. 2,600 నిట్స్ బ్రైట్‌నెస్, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేటు ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్, అండ్రాయిడ్ 15 ఓఎస్ ఆధారిత వన్ యూఐ 7తో ఇది పని చేస్తుంది. ఏడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇందులో వెనక వైపు 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 50 ఎంపీ టెలీ ఫొటో కెమెరా (5 ఎక్స్ ఆప్టికల్ జూమ్), 10 ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ కోసం 12 ఎంపీ కెమెరా ఉంటుంది. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది.
Samsung Galaxy S25:
ఎస్25 ఫోన్ 12జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. ఎస్ 25 ప్రారంభ ధర భారత్‌లో రూ.80,999గా ఉంది. ఐస్‌బ్లూ, మింట్, సిల్వర్ షాడో రంగుల్లో లభిస్తాయి. 6.2 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ డైనమిక్ అమోలోడ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఈ స్క్రీన్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7, అడ్వాన్స్‌డ్ గెలాక్సీ ఏఐ ఫీచర్లు ఉన్నాయి. ఏడు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇచ్చారు. వెనకవైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 10 ఎంపీ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 ఎంపీ ఉంటుంది. ఇందులో 4000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఉండగా.. 25 వాట్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ విడిగా కొనుక్కోవాలి.
Samsung Galaxy S25 Plus:
ఎస్ 25+ ఫోన్ 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ వేరియెంట్లలో వస్తోంది. 12జీబీ+256జీబీ ధర రూ.99,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఐస్‌బ్లూ, మింట్, సిల్వర్ షాడో రంగుల్లో వస్తున్నాయి. ఇందులో 6.7 ఇంచెస్ డిస్‌ప్లే ఉండగా.. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సొంతం. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. ఎస్25 కెమెరాలనే ఎస్25+లో ఉంటాయి. 4900 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ 45 వాట్స్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. ఈ ఫోన్లు యూఎస్ మార్కెట్లో ఫిబ్రవరి 7 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉండనున్నాయి.