Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిన ఈ సిరీస్‌కు దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రాణం పోశారు. ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన కథనంతో ‘దృశ్యం 1’ మరియు ‘దృశ్యం 2’ అద్భుతమైన విజయాలుగా నిలిచాయి. బాలీవుడ్‌తో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రం రీమేక్ అయ్యి, అక్కడ కూడా రికార్డులను సృష్టించింది.
Also Read : Devara 2 : ‘దేవర: పార్ట్ 2’ ప్రాజెక్ట్ నిలిపివేత? ఫ్యాన్స్‌లో టెన్షన్.. పూర్తి వివరాలు ఇవే!
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంఛైజీలో మూడవ భాగం అయిన ‘దృశ్యం 3’ షూటింగ్ చాలా సైలెంట్‌గా పూర్తయినట్లు తెలుస్తోంది. ‘జార్జ్ కుట్టి’ పాత్రకు ముగింపు పలకనున్న ఈ పార్ట్ 3 పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అయితే ‘దృశ్యం 3’ పూర్తి చేసిన వెంటనే మోహన్ లాల్ తన తదుపరి ముఖ్యమైన ప్రాజెక్ట్ లో జయిన్ అయ్యారట. ఆ సినిమానే ‘జైలర్ 2’. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన అతిథి పాత్రలో మోహన్ లాల్ నటించబోతున్నారు. శివరాజ్ కుమార్, మోహన్ లాల్ వంటి ఇతర స్టార్ హీరోల ఎంట్రీ ఆ చిత్రానికి మరింత హైప్ ఇచ్చింది. మొత్తానికి ‘దృశ్యం 3’లో తన భాగం పూర్తి చేసుకున్న మోహన్ లాల్, ‘జైలర్ 2’ లోని తన పాత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేయడానికి సెట్స్‌పైకి ఎంటర్ అయ్యారు.
తాజావార్తలు
-
Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి ‘నో’ చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!