Site icon NTV Telugu

Samantha : సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ ఇదేనా?

Samantha Raj

Samantha Raj

టాలీవుడ్ క్వీన్‌గా ఒక వెలుగు వెలిగిన సమంత, గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు, ఆ వెంటనే ‘మయోసైటిస్’ అనే ప్రాణాంతక అనారోగ్యం ఆమెను శారీరకంగా, మానసికంగా బాగా కుంగదీశాయి. ఒకానొక దశలో ఆమె ముఖంలో గ్లో తగ్గిపోయి, ఎంతో వేదనలో ఉన్నట్లు కనిపించడం అభిమానులను కలిచివేసింది. కానీ, కాలం అన్ని గాయాలను మారుస్తుందన్నట్లుగా.. ఇప్పుడు సమంత మళ్ళీ కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితంలో మళ్ళీ సంతోషం వెల్లివిరుస్తోంది. తాజాగా రాజ్‌తో కలిసి పబ్లిక్ అప్పియరెన్స్ ఇచ్చిన సమంత ముఖంలో ఆ పాత కళ, చిరునవ్వు చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

Also Read : Sankranthi : సంక్రాంతి ఎన్ని రోజుల పండుగ? ‘కనుమ నాడు కాకైనా కదలదు’ వెనుక అసలు కారణం ఇదే!

కేవలం వ్యక్తిగత జీవితమే కాకుండా, కెరీర్ పరంగా కూడా సామ్ మళ్ళీ ఫామ్‌లోకి వస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ టీజర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వడానికి సిద్ధమైంది. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని, అనారోగ్యాన్ని జయించి, కొత్త జీవితాన్ని ప్రారంభించిన సమంతను చూస్తుంటే.. మనిషి మనసు బాగుంటే ఆ గ్లో ముఖంలో దానంతట అదే వస్తుందని అర్థమవుతోంది. నటిగా, వ్యక్తిగా సమంత ఇలాగే సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలు అందుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆమెకు అభినందనలు కోరుతున్నారు.

Exit mobile version